Niharika Konidela Reveals Secret about her Kathak Training
Niharika Konidela : నిహారిక కొణిదెల ప్రస్తుతం మళ్ళీ నటిగా, నిర్మాతగా సినిమాలతో బిజీ అవుతుంది. ఒకప్పుడు సినిమాలు, సిరీస్ లు, షోలు చేసిన నిహారిక మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చింది. ఇక పెళ్లి, ఆ తర్వాత విడాకులు.. ఇలా కొన్ని రోజులు వైరల్ అయింది. విడాకుల అనంతరం మళ్ళీ తన కెరీర్ పై ఫోకస్ చేసింది నిహారిక. ఓ పక్క సినిమాలు, సిరీస్ లు చేస్తూ మరో పక్క తన సంతోషాన్ని వెతుక్కుంటుంది.
రెగ్యులర్ గా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది నిహారిక. తన ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్ చేస్తున్న వీడియోలను, ఫోటోలను షేర్ చేస్తుంది. తాజాగా నిహారిక నృత్యం చేస్తున్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసి.. 2023లో నాకు సంతోషాన్ని ఇచ్చింది కథక్(Kathak) అని పోస్ట్ చేసింది. దీంతో నిహారిక కథక్ నేర్చుకుందని తెలుస్తుంది. అయితే నిహారిక కథక్ నేర్చుకోవడం ఇన్ని రోజులు సీక్రెట్ గా ఉంచి ఈ విషయాన్ని ఇప్పుడు రివీల్ చేయడం విశేషం.
Also Read : Devara Update : దేవర నుంచి అదిరిపోయే అప్డేట్.. టక్కేసిన ఎన్టీఆర్.. గ్లింప్స్ ఎప్పుడు రిలీజ్ అంటే?
కథక్ నేర్చుకునే సమయంలోనే తీసిన ఫోటోలని నిహారిక పోస్ట్ చేసింది. దీంతో పలువురు నిహారికని అభినందిస్తున్నారు. మరి అభిమానులకు నిహారిక కథక్ ప్రదర్శన ఎప్పుడు చూపిస్తుందో చూడాలి. ప్రస్తుతం నిహారిక హీరోయిన్ గా ఒక సినిమా, నిర్మాతగా ఒక సినిమా చేస్తుంది.