Devara Update : దేవర నుంచి అదిరిపోయే అప్డేట్.. టక్కేసిన ఎన్టీఆర్.. గ్లింప్స్ ఎప్పుడు రిలీజ్ అంటే?
తాజాగా నేడు దేవర సినిమా నుంచి ఆసక్తికర అప్డేట్ ఇచ్చారు. దేవర సినిమా నుంచి ఓ కొత్త పోస్టర్ రిలీజ్ చేస్తూ దేవర గ్లింప్స్ డేట్ ని ప్రకటించారు.

NTR Koratala Siva Devara Movie New Update Glimpse Release Date Announced
Devara Update : RRR తర్వాత ఎన్టీఆర్(NTR) సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు నందమూరి అభిమానులు. కొరటాల శివ(Koratala Siva) దర్శకత్వంలో ఎన్టీఆర్ దేవర సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు కేవలం ఒక పోస్టర్ మాత్రమే రిలీజ్ అయింది. సినిమా మోస్ట్ వైలెన్స్, మాస్ గా ఉంటుందని చెప్పడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.
గత కొన్ని రోజులుగా దేవర టీజర్ త్వరలో రాబోతుందని వార్తలు వస్తున్నాయి. ఇటీవలే దేవర మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ దేవర టీజర్ రెడీ అయింది అంటూ మరింత హైప్ పెంచాడు. ఇటీవల కళ్యాణ్ రామ్ కూడా డెవిల్ సినిమా ప్రమోషన్స్ లో దేవర టీజర్ గురించి మాట్లాడారు.
తాజాగా నేడు న్యూ ఇయర్ సందర్భంగా దేవర సినిమా నుంచి ఆసక్తికర అప్డేట్ ఇచ్చారు. దేవర సినిమా నుంచి ఓ కొత్త పోస్టర్ రిలీజ్ చేస్తూ దేవర గ్లింప్స్ డేట్ ని ప్రకటించారు. ఈ పోస్టర్ లో ఎన్టీఆర్ సీరియస్ గా చూస్తూ ఉన్నారు. బ్లాక్ డ్రెస్ లో టక్ వేసుకొని పడవలో నించొని సముద్రంలోంచి వస్తున్నట్టు ఉన్నారు. ఇక దేవర సినిమా గ్లింప్స్ జనవరి 8న రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. దీంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గ్లింప్స్ కోసం ఎదురు చూస్తున్నారు.
ఇక దేవర సినిమాని రెండు పార్టులుగా ప్రకటిచగా మొదటి పార్ట్ ని 5 ఏప్రిల్ 2024లో రిలీజ్ చేస్తామని తెలిపారు. దేవర సినిమాతో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్(Janhvi Kapoor) తెలుగులో ఎంట్రీ ఇస్తుంది. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్, మలయాళం స్టార్ షైన్ టామ్ చాకో లు విలన్స్ గా కనపడబోతున్నారు.
అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు! Wishing you all a very Happy New Year.
Can’t wait for you all to experience the glimpse of #Devara on Jan 8th. pic.twitter.com/RIgwmVA6e0
— Jr NTR (@tarak9999) January 1, 2024