Chiru Venky : నువ్వు నా ముందుండి కమాండ్ వేస్తే నరుక్కుంటూ వస్తా.. చిరు, వెంకీ మల్టీస్టారర్ కథ చెప్పిన వెంకటేష్..

మెగాస్టార్ చిరంజీవి కూడా వెంకటేష్ తో తనకు ఉన్న అనుబంధం గురించి చెప్తూ వీరిద్దరి కాంబోలో సినిమా కూడా ఉంటుందని మాట్లాడారు.

Chiru Venky : నువ్వు నా ముందుండి కమాండ్ వేస్తే నరుక్కుంటూ వస్తా.. చిరు, వెంకీ మల్టీస్టారర్ కథ చెప్పిన వెంకటేష్..

Chiranjeevi and Venkatesh Reveal Their Multi starer Movie Story at Venky 75 Event

Updated On : January 1, 2024 / 10:02 AM IST

Chiru Venky : టాలీవుడ్ విక్టరీ వెంకటేష్(Venkatesh) తన కెరీర్ లో 75 సినిమాలు పూర్తి చేసుకుంటున్నారు. తన 75వ సినిమాగా ‘సైంధవ్‌’”(Saindhav) సినిమాతో ఈ సంక్రాంతికి రాబోతున్నారు. వెంకీ మామ 75 సినిమాలు కంప్లీట్ చేసుకున్నందుకు శుభాకాంక్షలు తెలియచేస్తూ సైంధవ్‌ నిర్మాణ సంస్థ నిహారిక ఎంటర్టైన్మెంట్స్ ఇటీవల ఓ గ్రాండ్ ఈవెంట్ ని అభిమానుల మధ్య నిర్వహించింది.

ఈ ఈవెంట్ కి చిరంజీవి(Chiranjeevi), రాఘవేంద్రరావు ముఖ్య అతిథిగా వచ్చారు. అలాగే నాని, శ్రీవిష్ణు, అడివిశేష్, బ్రహ్మానందం, అలీ, నిఖిల్, విశ్వక్ సేన్.. ఇలా పలువురు సినీ ప్రముఖులతో పాటు చిత్రయూనిట్ ఈ ఈవెంట్ కి విచ్చేశారు. అయితే ఈ ఈవెంట్ అప్పుడు టెలికాస్ట్ చేయకుండా తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా ఈ విన్ యాప్ లో ఈవెంట్ ని టెలికాస్ట్ చేశారు. దీంతో ఈవెంట్ లో జరిగిన ఆసక్తికర సంఘటనలు బయటకి వస్తున్నాయి.

Also Read : Hi Nanna : మొత్తానికి ‘హాయ్ నాన్న’ కలెక్షన్స్ బయటపెట్టారుగా.. నాని మరో భారీ హిట్..

ఈ ఈవెంట్ లో అందరూ వెంకటేష్ తో తమకు ఉన్న అనుబంధం గురించి మాట్లాడారు. మెగాస్టార్ చిరంజీవి కూడా వెంకటేష్ తో తనకు ఉన్న అనుబంధం గురించి చెప్తూ వీరిద్దరి కాంబోలో సినిమా కూడా ఉంటుందని మాట్లాడారు. చిరు, వెంకీ కాంబో సినిమా గురించి మాట్లాడుతూ.. మేమిద్దరం కలిసి సినిమా చేస్తే బాగుంటుందని అన్నారు. ఇప్పుడు నా వెనక ఎలా నిల్చున్నాడో, అలాగే నిన్ను ముందు పెడతాను నేను వెనకాల ఉంటాను చిరు. నువ్వు నా ముందుండి కమాండ్ వేస్తే నేను వెనక నుంచి నరుక్కుంటూ వస్తాను అని వెంకీ ఆల్రెడీ నాకు స్టోరీ లైన్ కూడా చెప్పేసాడు. ఒకవేళ అలాంటి కథ వస్తే బహుశా మా ఇద్దరం కలిసి సినిమా వీలైనంత త్వరలో రావాలని కోరుకుంటున్నాను అని అన్నారు. దీంతో అభిమానులు, ప్రేక్షకులు వీరిద్దరి కాంబోలో సినిమా త్వరగా రావాలని కోరుకుంటున్నారు.