Niharika Sensational Comments on AP Politics Janasena and Pawan Kalyan
Niharika Konidela : మెగా డాటర్ నిహారిక కొణిదెల విడాకుల తర్వాత కొంచెం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ కెరీర్ లో బిజీ అవుతుంది. నటిగా, నిర్మాతగా సినిమాలు చేస్తూ మరోవైపు సోషల్ మీడియాలో కూడా రెగ్యులర్ గా పోస్టులు పెడుతూ యాక్టివ్ గా ఉంది. తాజాగా నిహారిక ప్రముఖ యూట్యూబర్ నిఖిల్ కి ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో తన పెళ్లి, విడాకులు, ఫ్యామిలీ, తన ఫ్రెండ్స్, సినిమాలు, పవన్ కళ్యాణ్, ఏపీ రాజకీయాలు.. ఇలా అన్ని విషయాల గురించి మాట్లాడింది.
ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్(Pawan Kalyan) గురించి, ఏపీ రాజకీయాల(AP Politica) గురించి, జనసేన(Janasena) గురించి నిహారిక సంచలన వ్యాఖ్యలు చేసింది. నిఖిల్.. ఈసారి ఎవరికీ వోట్ వేస్తావు 2024 ఎలక్షన్స్ లో అని అడిగాడు. దీనికి నిహారిక సమాధానమిస్తూ.. నాన్న కూడా ప్రస్తుతం పాలిటిక్స్ లో ఉన్నారు కాబట్టి. మా ఓట్లు కూడా ఏపీకి షిఫ్ట్ చేశారు. ఆంధ్రాకి ఎవరి అవసరం ఉందో ఆయనకే ఓటు వేస్తాను. ఆంధ్రాకి అతను అవసర్లేదేమో నాకు తెలీదు కానీ ఆంధ్రాకి అతను కావాలి. ఇది నాకు తెలుసు. ఆంద్ర ప్రజలు రియలైజ్ అవ్వట్లేదు వాళ్ళకి కొత్త ప్రభుత్వం కావాలని. మీకు 500 రూపాయలు ఇచ్చి ఐదేళ్లలో మీ దగ్గర్నుంచి 5000 లేదా అయిదు లక్షలు లాక్కుంటున్నారు అది మీకు అర్ధం కావట్లేదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు రాజకీయ నాయకుడు కాదు లీడర్. నేను బాబాయ్ తో ఎక్కువ మాట్లాడలేదు. కానీ నాన్న బాబాయ్ తో జరిగేవి అన్ని మాకు చెప్తారు. కల్మషం లేని వ్యక్తి ఆయన. పాపం ఆంద్ర ప్రజలు వాళ్లకి తెలియట్లేదు. బాబాయ్ తప్పదు వాళ్ళ కోసం చేస్తాను అని సొసైటీ గురించి ఆలోచిస్తారు. ఈ రోజు అలా ఎవ్వరు లేరు. మా ఫ్యామిలీ ఆయనకు సపోర్ట్ ఉంటుంది. లాస్ట్ టైం ప్రచారానికి వెళ్ళాను. ఈసారి కూడా నేను ప్రచారానికి వెళ్తాను అని తెలిపింది.
Also Read : Niharika Konidela : విడాకులపై మొదటిసారి మాట్లాడిన నిహారిక.. సంచలన కామెంట్స్ చేసిన నిహారిక మాజీ భర్త..
అలాగే.. డబ్బు, ఫేమ్ ఉండి ఆయన ఎందుకు ఇలా చేస్తున్నారు జనాల కోసం అని నిఖిల్ అడగ్గా.. నాకు అది తెలియదు. మా బాబాయ్ కి ఎలాంటి బిజినెస్ లు లేవు. సినిమాలు చేస్తాడు, ఆ డబ్బులు మళ్ళీ జనసేనలో పెడతాడు. జనాలకి సమస్య ఉంది, అది సాల్వ్ చేయాలి అని అనుకుంటాడు. పొలిటీషియన్ అనే అర్ధం ఇప్పుడు మారింది. ఆయన్ని లీడర్ అనే పిలుస్తాను. ఆయనకు అంత దమ్ము ఎలా వస్తుందో నాకు తెలీదు. ఆయన ఏం చేసినా మేము ఆయనకు సపోర్ట్ చేస్తాము అని తెలిపింది. దీంతో నిహారిక ఏపీ రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.