మంచు మనోజ్‌కి హీరోయిన్‌గా నిహారిక కొణిదెల..? ఫస్ట్ లుక్ పోస్టర్‌లో హాట్‌గా అదరగొట్టిన నిహారిక

తాజాగా 'వాట్ ది ఫిష్' సినిమాలో నిహారిక కొణిదెల నటించబోతున్నట్టు ప్రకటిస్తూ నిహారిక ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు.

Niharika Konidela will play opposite to Manchu Manoj in What The Fish Movie

Niharika Konidela : మంచు మనోజ్(Manchu Manoj) ఆల్మోస్ట్ ఆరేళ్ళ గ్యాప్ తర్వాత ఇటీవలే మళ్ళీ సినిమాలతో బిజీ అవుతున్న సంగతి తెలిసిందే. ఉస్తాద్ అనే షోలో హోస్ట్ గా ఇటీవలే ప్రేక్షకుల ముందుకి వచ్చాడు మంచు మనోజ్. ఇటీవల కొన్ని నెలల క్రితం ‘వాట్ ది ఫిష్’ (What The Fish) అనే సరికొత్త టైటిల్ తో సినిమాని అనౌన్స్ చేశాడు మనోజ్. ఈ సినిమాతో త్వరలో వెండితెరపై కనిపిస్తానని ప్రకటించాడు. ఆల్రెడీ ఈ సినిమా ఫస్ట్ లుక్ గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు.

ఒక కొత్త కాన్సెప్ట్ తో ఈ వాట్ ది ఫిష్(What The Fish) సినిమా రాబోతుందని తెలుస్తుంది. కొత్త దర్శకుడు వరుణ్ కోరుకొండ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. విశాల్ అండ్ సూర్య బెజవాడ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శక్తికాంత్ కార్తీక్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో వెన్నెల కిషోర్ ఓ కీలక పాత్ర చేస్తుండగా తాజాగా నేడు నిహారిక పుట్టిన రోజు కావడంతో ఈ సినిమాలో నిహారిక కొణిదెల నటిస్తున్నట్టు ప్రకటించి నిహారిక ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు.

Also Read : ప్రభాస్‌తో సలార్‌కి ముందే పృథ్విరాజ్ సుకుమారన్ తెలుగులో వేరే హీరోతో మల్టీస్టారర్.. ఏ సినిమానో తెలుసా?

ఈ సినిమాలో నిహారిక మంచు మనోజ్ సరసన హీరోయిన్ గా నటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. తాజాగా రిలీజ్ చేసిన నిహారిక పోస్టర్ లో ఓ మెరిసేటి షార్ట్ డ్రెస్ లో అదరగొడుతుంది. అయితే హీరోయిన్ పాత్ర లేదా ఇంకేదైనా కీలక పాత్ర చేస్తుందా అనేది క్లారిటీ రావాలి. గతంలో హీరోయిన్ గా నిహారిక పలు సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకున్న నిహారిక ఇప్పుడు మళ్ళీ నటన వైపు దృష్టి పెట్టి సిరీస్ లు, సినిమాలకు ఓకే చెప్తుంది.