Site icon 10TV Telugu

Nikhil – Vishnupriya : బిగ్‌బాస్ లో పుష్ప 2 హవా.. నిఖిల్, విష్ణుప్రియ స్టెప్పులు అదుర్స్.. విష్ణుప్రియను ఎత్తుకొని..

Nikhil and Vishnupriya Performing Dance for Pushpa Songs in Bigg Boss 8

Nikhil and Vishnupriya Performing Dance for Pushpa Songs in Bigg Boss 8

Nikhil – Vishnupriya : తెలుగు బిగ్‌బాస్ సీజన్ 8 చివరికొచ్చేసింది. ఇప్పుడున్న కంటెస్టెంట్స్ అంతా టాప్ 5 లోకి వెళ్లాలని, కప్పు గెలవాలని తెగ కష్టపడుతున్నారు. బిగ్‌బాస్ లో గేమ్స్ తో పాటు కూసింత ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుందని తెలిసిందే. ప్రస్తుతం అన్నిచోట్లా పుష్ప హవా నడుస్తుంది. ఈ క్రమంలో బిగ్‌బాస్ లో కూడా పుష్ప క్రేజ్ పాకింది.

Also Read : Pushpa 2 : రిలీజ్ కి ముందు ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన పుష్ప యూనిట్.. ఆ టికెట్స్ బుక్ చేసుకుంటే..

నిన్నటి ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ తో డ్యాన్సులు వేయించారు. ఇందులో నిఖిల్, విష్ణుప్రియ కలిసి పుష్ప సినిమాలోని పాటలకు డ్యాన్సులు వేశారు. పుష్ప 1 లో సామి సామి పాటతో పాటు పుష్ప 2 సినిమాలోని పీలింగ్స్ సాంగ్స్ కి అదిరిపోయే స్టెప్పులు వేశారు. అల్లు అర్జున్, రష్మిక లాగే నిఖిల్, విష్ణుప్రియ కూడా తమ డ్యాన్సులతో అదరగొట్టారు. సాంగ్ లో చేసినట్టే నిఖిల్ కూడా విష్ణుప్రియని ఎత్తుకొని పుష్ప పాటకు స్టెప్పులు వేయడంతో ఈ వీడియో వైరల్ గా మారింది. మీరు కూడా నిఖిల్, విష్ణుప్రియ పుష్ప సాంగ్ కి వేసిన స్టెప్పులు చూసేయండి..

 

నిఖిల్, విష్ణుప్రియ డ్యాన్స్ చూసి వారి ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తుంటే బన్నీ ఫ్యాన్స్ పుష్ప క్రేజ్ మాములుగా లేదుగా అని కామెంట్స్ చేస్తున్నారు.

Exit mobile version