Ghatikachalam : ‘ఘటికాచలం’ మూవీ రివ్యూ.. నిర్మాత SKN రిలీజ్ చేసిన హారర్ థ్రిల్లర్..

ఘటికాచలం సినిమాని మాస్ మూవీ మేకర్స్ పై దర్శకుడు మారుతి, నిర్మాత SKN నేడు మే 31న రిలీజ్‌ చేశారు.

Nikhil Devadula Producer SKN Ghatikachalam Movie Review and Rating

Ghatikachalam Movie Review : పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన నిఖిల్ దేవాదుల మెయిన్ లీడ్ గా తెరకెక్కిన సినిమా ‘ఘటికాచలం’. ఒయాసిస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై MC రాజు నిర్మిస్తూ, కథ అందించగా అమర్ కామెపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని మాస్ మూవీ మేకర్స్ పై దర్శకుడు మారుతి, నిర్మాత SKN నేడు మే 31న రిలీజ్‌ చేశారు.

కథ విషయానికొస్తే.. కౌశిక్ (నిఖిల్ దేవాదుల) ఒక మెడికల్ స్టూడెంట్‌. తనకు ఇష్టం లేకపోయినా తండ్రి(ప్రభాకర్‌) కోసం డాక్టర్‌ అవ్వాలనుకుంటాడు. కౌశిక్ తనకి ఏం కావలి అని బయటకు కూడా చెప్పుకోలేని ఇంట్రోవర్ట్‌. కాలేజీలో తనతో పాటు చదివే ఓ అమ్మాయి(సమ్యు రెడ్డి)ని ప్రేమిస్తాడు. కానీ ఆ అమ్మాయి వేరే అబ్బాయితో లవ్ లో ఉందని తెలిసి మరింత మానసిక క్షోభకు గురవుతాడు. ఈ క్రమంలో తనకు మాత్రమే ఓ వాయిస్‌ వినిపిస్తూ ఉంటుంది. ఆ వాయిస్ కౌశిక్ ని పూర్తిగా మార్చేస్తూ ఉంటుంది.

కౌశిక్ లో వచ్చిన మార్పు గమనించిన తండ్రి డాక్టర్ వద్దకు తీసుకెళ్తే సైకలాజికల్‌ ప్రాబ్లమ్‌ అని చెప్తారు. అయితే కౌశిక్‌ కి మాత్రమే వినిపించే వాయిస్‌ కొన్నేళ్ల క్రితం చనిపోయిన ఘటికాచలంది అని తెలుస్తుంది. అసలు ఘటికాచలం ఎవరు? కౌశిక్‌కి మాత్రమే ఘటికాచలం వాయిస్ ఎందుకు వినిపిస్తుంది? కౌశిక్ కి ఏమైంది? కౌశిక్‌ లో వచ్చిన మార్పు వల్ల అతని చుట్టూ ఉండేవాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? కౌశిక్ ఆ సమస్య నుంచి బయటపడ్డాడా తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also Read : Shashtipoorthi : ‘షష్టిపూర్తి’ మూవీ రివ్యూ.. 37 ఏళ్ళ తర్వాత కలిసి నటించిన రాజేంద్రప్రసాద్ – అర్చన..

సినిమా విశ్లేషణ.. మెంటల్ హెల్త్ టాపిక్ అనే సమస్య మీద ఇటీవల పలు సినిమాలు వచ్చాయి. ఈ సినిమా కూడా అదే టాపిక్ తో కాస్త హారర్ ఎలిమెంట్స్ జతచేసి వచ్చింది. ఘటికాచలం సినిమా రియల్ గా జరిగిన ఓ సంఘటన ఆధారంగా అల్లుకున్న కథతో తెరకెక్కించారు. ఫస్ట్ హాఫ్ లో హీరో పాత్రని ఎస్టాబ్లిష్ చేయడానికి చాలా సమయం తీసుకున్నారు. ఫస్ట్ హాఫ్ మొదట్లో సినిమా కాస్త సాగదీసినట్టు అనిపిస్తుంది. కౌశిక్ పాత్రకు ఘటికాచలం వాయిస్ వినిపిస్తున్న దగ్గర్నుంచి సినిమా ఆసక్తిగా మారుతుంది.

సెకండ్ హాఫ్ లో ఘటికాచలం చుట్టూ తిరిగే సీన్స్ ఉత్కంఠంగా ఉంటాయి. హీరో భయపడే హారర్ సీన్స్ ఓ పక్క భయపెట్టిస్తూనే అక్కడక్కడా నవ్వు తెప్పిస్తాయి. అయితే సినిమా మెయిన్ పాయింట్ చాలా చిన్నదే. దాన్ని 2 గంటలపాటు నడిపించారు. ప్రస్తుత సమాజంలో పేరెంట్స్ జాబ్స్ తో బిజీగా ఉంటూ పిల్లలకు సమయం ఇవ్వకుండా, పిల్లలను చదువులో ఒత్తిడికి గురయ్యేలా చేయడం, పిల్లలకు – పేరెంట్స్ కి మధ్య దూరం, మానసిక వైద్యులు.. ఇలాంటి అంశాలతో పాటు ఓ మెసేజ్ ఇస్తూనే ఈ సినిమాని హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కించారు. హారర్ విషయంలో ఇంకాస్త భయపెట్టే ప్రయత్నాలు చేయాల్సింది.

నటీనటుల పర్ఫార్మెన్స్.. ఎన్నో సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా ప్రేక్షకులను మెప్పించిన నిఖిల్ దేవాదుల ఈ సినిమాలో రెండు మూడు వేరియేషన్స్ తో అద్భుతంగా నటించి మెప్పించాడు. డాక్టర్ గా ఆర్విక గుప్తా సినిమాలో కీలక పాత్ర పోషించి మెప్పించింది. సమ్యు రెడ్డి కాసేపు కనిపించి ఓకే అనిపిస్తుంది. తన్మయ్, ప్రభాకర్, దుర్గాదేవి, జోగినాయుడు.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో బాగానే నటించారు.

Also Read : Akhil akkineni wedding : సీఎం రేవంత్ రెడ్డిని క‌లిసిన నాగార్జున దంప‌తులు.. అఖిల్ పెళ్లికి ఆహ్వానం..!

సాంకేతిక అంశాలు.. ఈ సినిమాలో ముఖ్యంగా సినిమాటోగ్రఫీ విజువల్స్ ని అభినందించాలి. హీరో పాత్ర షేడ్స్ కి తగ్గట్టు లైటింగ్, విజువల్స్ లో బాగా కేర్ తీసుకున్నారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా ఇచ్చారు. హారర్ సన్నివేశాలకు మ్యూజిక్ చాలా ప్లస్ అయి ప్రేక్షకులను భయపెడుతుంది. ఒక మంచి పాయింట్ ని డైరెక్టర్ హారర్ థ్రిల్లర్ కథాంశంతో చెప్పాలనే ప్రయత్నం చేసాడు. నిర్మాణ పరంగా ఈ సినిమాకు కావాల్సినంత ఖర్చుపెట్టారు.

మొత్తంగా ‘ఘటికాచలం’ సినిమా ఓ వ్యక్తి మానసిక సంఘర్షణకు లోనయి అతనికి వేరే వాయిస్ వినిపిస్తుంటే అది ఎవరు, ఆ వ్యక్తి మాములు మనిషి అయ్యాడా అనే పాయింట్ తో హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కించారు. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.