Shashtipoorthi : ‘షష్టిపూర్తి’ మూవీ రివ్యూ.. 37 ఏళ్ళ తర్వాత కలిసి నటించిన రాజేంద్రప్రసాద్ – అర్చన..

టైటిల్ షష్టిపూర్తి అని పెట్టడంతో సినిమా అంతా దాని చుట్టే తిరుగుతుంది అనుకుంటారు.

Shashtipoorthi : ‘షష్టిపూర్తి’ మూవీ రివ్యూ.. 37 ఏళ్ళ తర్వాత కలిసి నటించిన రాజేంద్రప్రసాద్ – అర్చన..

RajendraPrasad Archana Aakanksha Singh Shashtipoorthi Movie Review

Updated On : May 30, 2025 / 6:50 PM IST

Shashtipoorthi Movie Review : రాజేంద్రప్రసాద్, అర్చన, రూపేష్, ఆకాంక్ష సింగ్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా షష్టిపూర్తి. మా ఆయీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపేష్ నిర్మాణంలో పవన్ ప్రభ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. చలాకి చంటి, చక్రపాణి ఆనంద్, మురళీధర్ గౌడ్, జబర్దస్త్ రామ్, సంజయ్ స్వరూప్.. పలువురు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు ఇళయరాజా మ్యూజిక్ అందించడం గమనార్హం.

కథ విషయానికొస్తే.. శ్రీరామ్(రూపేష్) ఒక లాయర్. ఒకే ఊళ్ళో ఉన్నా పేరెంట్స్ కి దూరంగా ఉంటాడు. నీతి, నిజాయితీ, అబద్దాలు ఆడకుండా ఉండటం వల్ల అందరికి దూరంగా ఉంటాడు. జానకి(ఆకాంక్ష సింగ్) ఓ అర్ధరాత్రి శ్రీరామ్ కి కనిపించి ఆ ఊళ్ళో సుహాస్ అనే వ్యక్తి తన ల్యాండ్ లాక్కున్నాడని, దాని కోసమే వచ్చానని చెప్తుంది. శ్రీరామ్.. జానకి ప్రేమలో పడతాడు. కానీ జానకికి ఇతని నిజాయితీ నచ్చక, అబద్దాలు ఆడాలి, లైఫ్ లో సంపాదించాలి అని చెప్పడంతో ఆమె కోసం శ్రీరామ్ నిజాయితీ వదిలేసి డబ్బుల కోసం కేసులు వాదిస్తాడు.

తల్లి భువన(అర్చన) స్నేహితురాలి కేసులో శ్రీరామ్ వేరేవాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని అన్యాయం చేస్తాడు. దీంతో తల్లి శ్రీరామ్ ని దూరం పెడుతుంది. ఒకే ఇంట్లో ఉన్నా శ్రీరామ్ తల్లి – తండ్రి దివాకరం(రాజేంద్రప్రసాద్) మధ్య 30 ఏళ్లుగా మాటలు ఉండవు. అసలు జానకి శ్రీరామ్ ని ఎందుకు చెడు మార్గంలో ప్రయాణించేలా చేస్తుంది? శ్రీరామ్ తన తల్లికి దగ్గరవుతాడా? దివాకరం – భువన ఎందుకు 30 ఏళ్లుగా దూరంగా ఉంటున్నారు? తల్లితండ్రులు ఉన్నా అదే ఊళ్ళో శ్రీరామ్ ఎందుకు విడిగా ఉంటున్నాడు? అసలు జానకి ఎవరు? సుహాస్ తో ల్యాండ్ ఇష్యూ ఏంటి తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also Read : Bhairavam : ‘భైరవం’ మూవీ రివ్యూ.. ముగ్గురు హీరోల కంబ్యాక్ అదిరిందిగా..

సినిమా విశ్లేషణ.. టైటిల్ షష్టిపూర్తి అని పెట్టడంతో సినిమా అంతా దాని చుట్టే తిరుగుతుంది అనుకుంటారు. కానీ తల్లి తండ్రుల ప్రేమ, నీతి, నిజాయితీ, ఓ లవ్ స్టోరీ చుట్టూ కథ తిరుగుతుంది. ఫస్ట్ హాఫ్ లో శ్రీరామ్ పాత్ర గురించి చెప్పి జానకితో లవ్ స్టోరీ, జానకి శ్రీరామ్ ని మారమని చెప్పడంతో కాస్త రొటీన్ గానే సాగుతుంది. ఫస్ట్ హాఫ్ కాస్త సాగదీసినట్టు ఉంటుంది. ఇంటర్వెల్ లో మాత్రం ఊహించని ట్విస్ట్ ఇవ్వడంతో సెకండ్ హాఫ్ లో ఆసక్తి నెలకొంటుంది. ఇక సెకండ్ హాఫ్ లో రాజేంద్రప్రసాద్ – అర్చనల ఫ్లాష్ బ్యాక్, వాళ్ళ లవ్ స్టోరీ బాగానే రాసుకున్నారు. చూడటానికి పాత సినిమాల్లాగే అనిపిస్తుంది. కొడుకు తప్పు చేసాడని శ్రీరామ్ ని దూరం పెట్టడం, ఆ తర్వాత శ్రీరామ్ తల్లి తండ్రులకు సంబంధించిన సీన్స్ కాస్త కొత్తగా రాసుకున్నారు. ప్రీ క్లైమాక్స్ కోర్ట్ డ్రామా కాస్త కొత్తగా ఉంటుంది. ఇక క్లైమాక్స్ మాత్రం త్వరత్వరగా పాత సినిమాల్లోలాగే శుభం కార్డు పడేలా ముగించేశారు.

shashtipoorthi movie

నటీనటుల పర్ఫార్మెన్స్.. ఒకప్పటి నటి అర్చన తల్లి పాత్రలో మెప్పిస్తునే ఫ్లాష్ బ్యాక్ లవ్ స్టోరీలో తన పాత సినిమాల్లోలాగే కనిపించి అలరించింది. సైలెంట్ గా ఉండే తండ్రి పాత్రలో, ఫ్లాష్ బ్యాక్ లవ్ స్టోరీలో రాజేంద్రప్రసాద్ సెటిల్డ్ పర్ఫార్మెన్స్ తో మెప్పిస్తారు. కొత్త హీరో అయినా రూపేష్ లాయర్ పాత్రలో, యాక్షన్ సీన్స్ లో బాగానే మెప్పిస్తాడు. ఇక ఆకాంక్ష సింగ్ పల్లెటూరి అమ్మాయి పాత్రలో, ఆలయ ధర్మకర్తగా పెద్దరికంగానే కనిపిస్తూ లవ్ స్టోరీలో క్యూట్ గా అలరించింది. ఓ సాంగ్ లో తన అందాలు బాగానే ఆరబోసింది. చలాకి చంటి, చక్రపాణి ఆనంద్, మురళీధర్ గౌడ్, జబర్దస్త్ రామ్, అచ్యుత్ కుమార్, సంజయ్ స్వరూప్.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో బాగానే నటించారు.

Also Read : Karate Kid: Legends : ‘కరాటే కిడ్ – లెజెండ్స్’ మూవీ రివ్యూ.. జాకీచాన్ సినిమా ఎలా ఉందంటే..

సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. గోదావరి, నది పక్క చుట్టుపక్కల లొకేషన్స్ బాగా చూపించారు. ఇళయరాజా ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అంతా ఆయన పాత సినిమాల్లాగే అనిపిస్తుంది. పాటలు కూడా వినడానికి బాగున్నా అన్ని పాత ఇళయరాజా పాటలు గుర్తుకొస్తాయి. సాంగ్స్, మ్యూజిక్ అంతా పాత సినిమాల ఫార్మేట్ లోనే ఉంటాయి. రీ రికార్డింగ్ లో సౌండ్ కొంచెం తగ్గిస్తే బాగుండేది. ఓ పక్కన హీరోగా నటిస్తూనే నిర్మాణ బాధ్యతలు కూడా చూసుకున్నాడు రూపేష్. నిర్మాణ పరంగా బాగానే ఖర్చుపెట్టారు. రొటీన్ కథకు తల్లితండ్రుల ప్రేమ, ఓ రివెంజ్ స్టోరీ ని యాడ్ చేసి కొత్తగ ఆచూపించే ప్రయత్నం చేసాడు దర్శకుడు.

మొత్తంగా ‘షష్టిపూర్తి’ సినిమా తల్లి తండ్రుల ప్రేమ, ఓ లవ్ స్టోరీ, నీతి నిజాయితలతో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఈ సినిమాకు 2.5 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.