Nikhil Siddhartha : కొత్త స్టార్ ట్యాగ్ ఇచ్చుకున్న హీరో నిఖిల్.. భలేగా ఉందే..

రెగ్యులర్ గా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉందే నిఖిల్ తాజాగా తన ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టాడు.

Nikhil Siddarth Interesting Post on His Star Tag in twitter goes Viral

Nikhil Siddhartha : మన హీరోలకు, హీరోయిన్స్ కు పేరు ముందు ట్యాగ్స్, స్టార్స్ తగిలిస్తారని తెలిసిందే. ఇటీవల యువ హీరోలు కొంతమంది ఆ స్టార్ ట్యాగ్స్ తగిలించుకుంటుంటే మరికొంతమంది ఉన్నవి మార్చుకుంటున్నారు. ఇటీవల కాలంలో సుధీర్ బాబు నవ దళపతి అని, శర్వానంద్ చార్మింగ్ స్టార్ అని, రాజ్ తరుణ్ జోవియల్ స్టార్ అని.. ఇలా చాలా మంది యువ హీరోలు కొత్త ట్యాగ్స్ తగిలించుకుంటున్నారు. స్టార్ హీరోలేమో స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అని, మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అని, యంగ్ టైగర్ నుంచి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అని ఇలా మార్చుకుంటున్నారు.

ఈ తరహాలో ఇప్పుడు హీరో నిఖిల్ కూడా తనకు కొత్త స్టార్ ట్యాగ్ ఇచ్చుకున్నట్టు తెలుస్తుంది. ఒకపుడు కమర్షియల్ సినిమాలు చేసి ఫెయిల్ అయిన నిఖిల్ స్వామిరారా, కార్తికేయ సినిమాల నుంచి కంటెంట్ ఉన్న సరికొత్త సినిమాలు చేస్తూ మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా స్టార్ డమ్ తెచ్చుకొని ఇప్పుడు వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. త్వరలో స్వయంభు సినిమాతో రాబోతున్నాడు నిఖిల్.

Also Read : Pushpa 2 Records : మహేష్, ప్రభాస్ రికార్డులను బద్దలుకొట్టిన అల్లు అర్జున్.. పుష్ప 2 రికార్డుల వేట ట్రైలర్ నుంచే మొదలు..

రెగ్యులర్ గా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉందే నిఖిల్ తాజాగా తన ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టాడు. UNIK అని టైప్ చేసి స్టార్ సింబల్ వేసి పోస్ట్ చేసాడు. ఆ తర్వాత ఇకపై నన్ను యూనిక్ స్టార్ అనే ట్యాగ్ చేయండి అంటూ పెట్టాడు. తన ట్విట్టర్ బయోలో కూడా యూనిక్ స్టార్ అని అర్ధం వచ్చేలా యాడ్ చేసాడు. దీంతో నిఖిల్ పోస్ట్ వైరల్ గా మారింది. నిఖిల్ తనకు యూనిక్ స్టార్ అనే కొత్త ట్యాగ్ తనకు తానే ఇచ్చుకున్నాడా అని ఫ్యాన్స్, నెటిజన్లు సందేహం వ్యక్తపరుస్తున్నారు. దీనిపై నిఖిల్ క్లారిటీ ఇవ్వాలి లేదా వచ్చే సినిమా వరకు వేచి చూడాలి. ఇక కొంతమంది నెటిజన్లు యూనిక్ కథలు సెలెక్ట్ చేసుకుంటున్నాడు కాబట్టి యూనిక్ స్టార్ అని పెట్టుకున్నాడేమో అని సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.