Pushpa 2 Records : మహేష్, ప్రభాస్ రికార్డులను బద్దలుకొట్టిన అల్లు అర్జున్.. పుష్ప 2 రికార్డుల వేట ట్రైలర్ నుంచే మొదలు..

పుష్ప 2 ట్రైలర్ యూట్యూబ్ లో సరికొత్త రికార్డులు సృష్టిస్తుంది.

Pushpa 2 Records : మహేష్, ప్రభాస్ రికార్డులను బద్దలుకొట్టిన అల్లు అర్జున్.. పుష్ప 2 రికార్డుల వేట ట్రైలర్ నుంచే మొదలు..

Allu Arjun Pushpa 2 Movie Trailer Creates New Records in Youtube beats Mahesh Babu Prabhas Trailer Records

Updated On : November 18, 2024 / 4:53 PM IST

Pushpa 2 Records : అల్లు అర్జున్ పుష్ప 2 ట్రైలర్ నిన్న రిలీజయి సినిమాపై భారీ అంచనాలు పెంచింది. బీహార్ పాట్నాలో పుష్ప 2 ట్రైలర్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించి నార్త్ లో అల్లు అర్జున్ క్రేజ్, పుష్ప క్రేజ్ ఏంటో మరోసారి ప్రూవ్ చేసారు. ఇక పుష్ప 2 ట్రైలర్ యూట్యూబ్ లో సరికొత్త రికార్డులు సృష్టిస్తుంది. కేవలం తెలుగులోనే పుష్ప 2 ట్రైలర్ ఇప్పటికే 44 మిలియన్ వ్యూస్ సాధించింది. అన్ని భాషల్లో కలిపి పుష్ప 2 ట్రైలర్ ఇప్పటికే 100 మిలియన్ వ్యూస్ దాటింది.

Also See : Pushpa 2 Trailer Launch Event : పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఫొటోలు చూశారా.. ఆ జనాలు ఏందిరా సామీ..

తెలుగులో అతి తక్కువ సమయంలో ఇంకా 24 గంటలు కూడా పూర్తికాకముందే అత్యధిక వ్యూస్ సాధించిన ట్రైలర్ గా పుష్ప 2 రికార్డ్ సెట్ చేసింది. అంతకు ముందు మహేష్ బాబు గుంటూరు కారం సినిమా ట్రైలర్ 24 గంటల్లో 37 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. ప్రభాస్ సలార్ 32 మిలియన్లకు పైగా వ్యూస్ దక్కించుకుంది. ఇప్పుడు అల్లు అర్జున్ 24 గంటల లోపే ఆ రికార్డులను బద్దలుకొట్టి సరికొత్త రికార్డ్ సృష్టించాడు.

 

అలాగే అన్ని భాషల్లో కలిపి ఇండియన్ సినిమాలోనే అత్యంత వేగంగా 100 మిలియన్స్ సాధించిన సినిమాగా నిలిచింది పుష్ప 2. ఇక 24 గంటల్లో పుష్ప 2 తెలుగు ట్రైలర్ ఎన్ని మిలియన్స్ వ్యూస్ సాధించి ఏ రికార్డ్ సెట్ చేస్తుందో చూడాలి. సినిమా 24 గంటలలోపే ఇలా పలు రికార్డులు సెట్ చేస్తుంది అంటే ఇక ఒక్క రోజులో ఆ పైన ఇంకెన్ని రికార్డులు సెట్ చేస్తుందో చూడాలి. మొత్తానికి పుష్ప 2 రికార్డుల వేట ట్రైలర్ నుంచే మొదలైంది.