Swayambhu : ట్రైనింగ్ అయ్యిపోయింది.. ఇక యుద్దానికి సిద్దమవుతున్న నిఖిల్..

నిఖిల్ సిద్దార్థ 'స్వయంభు' సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ గురించి..

Nikhil Siddhartha new movie Swayambhu shooting updates

Swayambhu : తెలుగు యువ హీరో నిఖిల్ సిద్దార్థ.. ప్రస్తుతం ‘స్వయంభు’ అనే సినిమాలో నటించడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో నిఖిల్.. యోధుడిగా కనిపించబోతున్నాడు. భరత్ కృష్ణమాచారి ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్ పై ఠాగూర్ మధు ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. సోషియో ఫాంటసీ నేపథ్యంతో ఈ సినిమా ఉండబోతుందని సమాచారం. సంయుక్త మీనన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే నిఖిల్ అండ్ సంయుక్త ఫస్ట్ లుక్స్ ని రిలీజ్ చేశారు.

ఇక కొన్ని రోజులు నుంచి ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ లో బిజీగా ఉంది. యోధుడిగా కనిపించడానికి నిఖిల్ చాలా హోమ్ వర్క్ చేస్తున్నాడు. ఈక్రమంలోనే కత్తి సాము, మార్షల్ ఆర్ట్స్ వంటి ట్రైనింగ్ తీసుకుంటూ వస్తున్నాడు. ఇటీవల మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ కోసం ‘వియత్నాం’ వెళ్లిన నిఖిల్.. అక్కడ 30 రోజుల ట్రైనింగ్ ని పూర్తి చేశాడు. ఇక ఇప్పుడు షూటింగ్ ని మొదలు పెట్టబోతున్నట్లు నిఖిల్ తెలియజేశాడు. కాగా నిఖిల్ ఈ సినిమాలో లాంగ్ హెయిర్ తో ఒక న్యూ లుక్ లో కనిపించబోతున్నాడు. రవి బస్రూర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు.

Also read : Bigg Boss 7 : ఈవారం ఈ కంటెస్టెంట్స్ బాగ్‌బాస్ హౌస్‌లోకి రాబోతున్నారా..?

నిఖిల్ తన కెరీర్ లో మొదటిసారి యోధుడి పాత్రలో నటించబోతున్నాడు. నిఖిల్ లాస్ట్ మూవీ ‘స్పై’ ఆడియన్స్ అంచనాలను అందుకోలేకపోయింది. మరి యోధుడిగా తన సరికొత్త అవతారంతో ఆడియన్స్ ని ఎంత వరకు ఆకట్టుకుంటాడో చూడాలి. కాగా ఈ చిత్రం తరువాత నిఖిల్ ‘ది ఇండియా హౌస్’ అనే సినిమా చేయబోతున్నాడు. ఆ మూవీని మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు. ఆ మూవీ పై ఆడియన్స్ లో భారీ అంచనాలే నెలకొన్నాయి. స్వయంభు, ది ఇండియా హౌస్.. రెండు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ గా తెరకెక్కుతున్నాయి.