Bigg Boss 7 : ఈవారం కొత్త కంటెస్టెంట్స్ బాగ్‌బాస్ హౌస్‌లోకి రాబోతున్నారా..?
ఎవరూ ఊహించని ఒక విషయం చెబుతాను అంటూ నాగార్జున చెప్పింది కొత్త కంటెస్టెంట్స్ గురించేనా..? ఈ కంటెస్టెంట్స్ బాగ్‌బాస్ హౌస్‌లోకి రాబోతున్నారా..?

New contestants entry list buzz on telugu bigg boss season 7
Bigg Boss 7 : బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7 ఆరో వారంలోకి అడుగు పెద్దతబోతుంది. ఇక ఇప్పటికే హౌస్ నుంచి కిరణ్ రాథోడ్, షకీలా, దామిని, రతిక లు ఎలిమినేట్ అయ్యి బయటకి వచ్చేశారు. ఇక వారం ఎవరు బయటకి రాబోతున్నారని అందరిలో ఆసక్తి నెలకుంది. దీంతో నిన్న ప్రేక్షకులతో పాటు కంటెస్టెంట్స్ ఎలిమినేషన్ అంశం కోసం ఎదురు చూస్తుంటే.. నాగార్జున మాత్రం ఒక సరికొత్త ట్విస్ట్ తో వచ్చాడు. హౌస్‌లో ఉండటానికి అర్హత లేని ఒక ముగ్గురు పేర్లను చెప్పాలని కోరాడు. అంతేకాదు ఒక కండిషన్ కూడా పెట్టాడు.
Also Read : Varun Lavanya : వరుణ్ లావణ్య ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్.. ఫోటోలు షేర్ చేసిన మెగాస్టార్..
ప్రశాంత్, సందీప్, శోభాశెట్టి పేర్లు మాత్రం చెప్పకూడదని తెలియజేశాడు. దీంతో హౌస్‌లోని వారంతా నామినేట్ చేసిన వాళ్లలో అమరదీప్, తేజ, గౌతమ్ పేర్లు ఎక్కువుగా వినిపించడంతో.. హౌస్ లో ఈ ముగ్గురు అనర్హలుగా తేల్చారు. ఇక ప్రేక్షకులు అనుకుంటున్న ఆ ముగ్గురు అనర్హులు ఎవరనేది నేను చెబుతాను, అలాగే ఎవరూ ఊహించని ఒక విషయం కూడా చెబుతాను అంటూ నాగార్జున చెప్పడంతో శనివారం ఎపిసోడ్ పూర్తి అయ్యింది. దీంతో ఆదివారం ఎపిసోడ్ లో ఏం జరగబోతుందని అందరిలో ఆసక్తి మరింత పెరిగింది.
Also Read : Ram Charan : రాజ్‌కుమార్ హిరానీతో రామ్‌చరణ్ కథ చర్చలు.. నిజమేనా..?
ఇక ఈ ఆదివారం హౌసులోకి కొత్తగా మరో ఆరుగురు కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలుస్తుంది. నాగార్జున చెబుతాను అన్న విషయం కూడా ఇదేనని తెలుస్తుంది. కాగా హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న కొత్త కంటెస్టెంట్స్ గురించి కొన్ని పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. భోలే శవాలి, నాయని పావని, అశ్విని శ్రీ, అర్జున్ అంబటి, పూజా మూర్తి.. హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలుస్తుంది. మరి ఈరోజు ఎపిసోడ్ చూస్తే గాని ఒక క్లారిటీ రాదు.. హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోయే ఆ కొత్త కంటెస్టెంట్స్.