Nikhil Siddhartha : ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ అంటున్న నిఖిల్.. సైలెంట్‌గా సినిమా తీసి రిలీజ్‌కి రెడీ.. సప్తసాగరాలు హీరోయిన్‌తో..

ప్రస్తుతం 'స్వయంభు'తో పాటు మరో రెండు భారీ పాన్ ఇండియా సినిమాలు నిఖిల్ చేతిలో ఉన్నాయి. కానీ సడెన్ గా..

Nikhil Siddhartha Rukmini Vasanth Movie Announced with Feel Good Poster

Nikhil Siddhartha : హీరో నిఖిల్ కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ తెచ్చుకున్నాడు. అయితే ప్రస్తుతం ‘స్వయంభు’తో పాటు మరో రెండు భారీ పాన్ ఇండియా సినిమాలు నిఖిల్ చేతిలో ఉన్నాయి. కానీ సడెన్ గా అసలు ఇప్పటివరకు అనౌన్స్ చేయని సినిమాని ప్రకటించి దీపావళికి రిలీజ్ చేస్తున్నామని కూడా అనౌన్స్ చేయడం గమనార్హం.

Also Read : Jahnavi Dasetty : తల్లి కాబోతున్న మహాతల్లి.. ప్రగ్నెన్సీ ప్రకటించిన యూట్యూబర్ జాహ్నవి..

SVCC బ్యానర్ పై BVSN ప్రసాద్ నిర్మాణంలో సుధీర్ వర్మ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా సప్త సాగరాలుతో ఫేమ్ తెచ్చుకున్న రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నేడు ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ అనే టైటిల్ తో సినిమాని ప్రకటించారు. అలాగే ఈ సినిమా ఈ దీపావళికి రిలీజ్ చేస్తామని కూడా అనౌన్స్ చేయడంతో ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఈ సినిమా సైలెంట్ గా ఎప్పుడు తీసేసారు అని సోషల్ మీడియాలో నిఖిల్ ని అడుగుతున్నారు.

తాజాగా రిలీజ్ చేసిన ఈ సినిమా పోస్టర్ చూస్తుంటే ఇది ఫీల్ గుడ్ లవ్ స్టోరీ సినిమా అని తెలుస్తుంది. గతంలో సుధీర్ వర్మ నిఖిల్ కాంబోలో స్వామిరారా, కేశవా సినిమాలు వచ్చి మెప్పించాయి. మరి ఇప్పుడు ఈ సినిమా ఏ రేంజ్ లో మెప్పిస్తుందో చూడాలి.