Jahnavi Dasetty : తల్లి కాబోతున్న మహాతల్లి.. ప్రగ్నెన్సీ ప్రకటించిన యూట్యూబర్ జాహ్నవి..
ప్రముఖ యూట్యూబర్, నటి జాహ్నవి తాజాగా తాను తల్లి కాబోతున్నట్టు ప్రకటించింది.

Jahnavi Dasetty Aka Mahathalli Became Pregnant announced with a Video
Jahnavi Dasetty : ప్రముఖ యూట్యూబర్, నటి జాహ్నవి తాజాగా తాను తల్లి కాబోతున్నట్టు ప్రకటించింది. తెలుగులో ఆల్మోస్ట్ మొదటి యూట్యూబర్ గా జాహ్నవి పేరు తెచ్చుకుంది. యూట్యూబ్ పాపులర్ అవుతున్న సమయంలో చిన్న చిన్న వీడియోలతో మహాతల్లి అనే ఛానల్ తో బాగా పాపులర్ అయింది జాహ్నవి. దీంతో మహాతల్లి పేరుతోనే యూట్యూబర్ గా మంచి పేరు, పాపులారిటీ తెచ్చుకుంది జాహ్నవి.
కొన్నాళ్ల క్రితం సుశాంత్ రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. రెగ్యులర్ గా ఈ జంట సోషల్ మీడియాలో క్యూట్ ఫోటోలు పోస్ట్ చేస్తూ ఉంటారు. తాజాగా తాను తల్లిని కాబోతున్నట్టు, మూడు నెలల క్రితమే తాను ప్రగ్నెంట్ అయినట్టు ఓ వీడియో ద్వారా తెలిపింది. తాను ప్రగ్నెంట్ అన్న విషయం భర్తకు చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతున్న వీడియోను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది మహాతల్లి అలియాస్ జాహ్నవి. దీంతో పలువురు ప్రముఖులు, ఆమె ఫ్రెండ్స్, నెటిజన్లు ఈ జంటకు కంగ్రాట్స్ చెప్తున్నారు.