Bigg Boss 8 : బిగ్ బాస్ ఆదివారం ప్రోమో వచ్చేసింది.. హౌస్‌లోకి ఇంతమంది సెలబ్రిటీలు.. వైల్డ్ కార్డులు ఎవరెవరంటే..?
అలాగే నేడు ఆదివారం ఎపిసోడ్ కావడంతో పలువురు సెలబ్రిటీలు హౌస్ లోపలికి వెళ్లారు.

Bigg Boss Telugu Season 8 Sunday Special Promo Released Wild Card Entry and Celebrities Entry
Bigg Boss 8 Promo : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఇప్పటికే నాలుగు వారాలు పూర్తిచేసుకొని నేడు ఐదోవారం ముగించబోతుంది. ఇప్పటికే 5 గురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవ్వగా మరో 8 మంది వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా నేడు హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. అలాగే నేడు ఆదివారం ఎపిసోడ్ కావడంతో పలువురు సెలబ్రిటీలు తమ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హౌస్ లోపలికి వెళ్లారు.
నేడు ఆదివారం ఎపిసోడ్ కి బిగ్ బాస్ హౌస్ లోకి స్వాగ్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా శ్రీవిష్ణు, రీతూ వర్మ, దక్ష నగర్కర్ ఎంట్రీ ఇచ్చారు. జనక అయితే గనక సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సుహాస్, దిల్ రాజు, సంగీర్తన ఎంట్రీ ఇచ్చారు. మా నాన్న సూపర్ హీరో ప్రమోషన్స్ లో భాగంగా సుధీర్ బాబు, షాయాజీ షిండే హౌస్ లో సందడి చేసారు. ఇంతమంది సెలబ్రిటీలు హౌస్ లోకి వెళ్లడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉండబోతుందని తెలుస్తుంది.
అలాగే వైల్డ్ కార్డు ఎంట్రీల గురించి కూడా చూపించినా ఎక్కడా ఫేస్ లు కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. ఇవాళ్టి రాత్రి ఎపిసోడ్ లోనే చూడాలి వైల్డ్ కార్డు ఎంట్రీలు ఎవరెవరు వస్తారో. అయితే బిగ్ బాస్ లీకుల ప్రకారం హరితేజ, నయని పావని, మెహబూబ్, టేస్టీ తేజ, గంగవ్వ, అవినాష్.. వైల్డ్ కార్డు ఎంట్రీల ద్వారా హౌస్ లోపలి వెళ్తారని సమాచారం. అయితే వీళ్లంతా గతంలో బిగ్ బాస్ లో పాల్గొన్నవాళ్ళే. మీరు కూడా నేటి బిగ్ బాస్ ప్రోమో చూసేయండి..