SSMB 29 – Sudheer Babu : రాజమౌళి – మహేష్ సినిమాపై సుధీర్ బాబు కామెంట్స్.. ఇప్పుడు కనిపిస్తున్న మహేష్ లుక్ ఫైనల్ కాదు..
రాజమౌళి - మహేష్ బాబు సినిమా గురించి సుధీర్ బాబు తాజాగా పలు కామెంట్స్ చేసారు.

Sudheer Babu Interesting Comments on Rajamouli Mahesh Babu Movie
SSMB 29 – Sudheer Babu : మహేష్ బాబు త్వరలో రాజమౌళితో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మహేష్ బాబు ఆ సినిమా లుక్ కోసం ప్రిపేర్ అవుతున్నాడు. బాడీ పెంచుతూ, బాగా జుట్టు, గడ్డం పెంచి ఇటీవల పలుమార్లు కనపడ్డాడు. దీంతో మహేష్ బాబు ఇప్పటివరకు ట్రై చేయాని కొత్త లుక్ అంటూ ఆ ఫోటోలు వైరల్ అయ్యాయి. అయితే ఆ లుక్ ఫైనల్ కాదంటూ రాజమౌళి – మహేష్ బాబు సినిమా గురించి సుధీర్ బాబు తాజాగా పలు కామెంట్స్ చేసారు.
సుధీర్ బాబు మాట్లాడుతూ.. బాగా కండలు పెంచుకోవడం, షర్ట్ విప్పి సీన్స్ చేయడం మహేష్ కు అసలు నచ్చవు. ఆయన కొన్ని బౌండరీలు పెట్టుకున్నాడు. కానీ రాజమౌళి సినిమాకు మహేష్ బౌండరీలు అన్ని తీసేసినట్టు తెలుస్తుంది. రాజమౌళికి పూర్తిగా సరెండర్ అయి ఆయన ఏది చెప్తే అది చేస్తాడు. మహేష్ ఎప్పట్నుంచో కొన్ని విషయాల్లో బౌండరీలు పెట్టుకున్నాడు. ఇదే కరెక్ట్ టైం అలాంటో బౌండరీలు అన్ని పోగొట్టడానికి. మహేష్ ప్రస్తుతం కనిపిస్తున్న లుక్ ఫైనల్ లుక్ కాదు. ఇంకా జుట్టు, గడ్డం పెంచిన తర్వాత అప్పుడు మేకోవర్ కోసం కొన్ని గెటప్స్ చెక్ చేసి రాజమౌళి ఫైనల్ చేస్తారట. త్వరలోనే దానికి సంబంధించిన వర్క్ షాప్ మొదలవుతుంది అని తెలిపారు.
మహేష్ బాబు సాధారణంగా సినిమాల్లో, బయట షర్ట్ విప్పడం కానీ, సిక్స్ ప్యాక్ కానీ చేయరు. కానీ ఈ సినిమాతో బాగా బాడీ పెంచి షర్ట్ తీసేసి సిక్స్ ప్యాక్ లాంటిది ఏమైనా చూపిస్తారని సుధీర్ బాబు మాటల్లో అర్ధమవుతుంది. మహేష్ ఫ్యాన్స్ మాత్రం రాజమౌళి సినిమా ఎప్పుడు మొదలుపెడతారా అని ఎదురుచూస్తున్నారు. ఇక సుధీర్ బాబు అక్టోబర్ 11న మా నాన్న సూపర్ హీరో అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.