Nikhil Siddhartha : అమెరికా అతిపెద్ద హిందూ ఆలయంలో నిఖిల్.. బెస్ట్ మూమెంట్స్ అంటూ పోస్ట్..

తాజాగా నిఖిల్ అమెరికాలో అతిపెద్ద హిందూ ఆలయం శ్రీ స్వామి నారాయణ మందిర్ ని దర్శించుకున్నాడు.

Nikhil Siddhartha visited biggest hindu Temple in America and Posted feeling Blessed

Nikhil Siddhartha : నిఖిల్ హీరోగా ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. కార్తికేయ 2 పెద్ద విజయం సాధించడంతో పాన్ ఇండియా హీరో అయ్యాడు. అప్పట్నుంచి అన్ని భారీ సినిమాలనే ఓకే చేస్తున్నాడు. ఆల్రెడీ మూడు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ని కూడా అనౌన్స్ చేసాడు నిఖిల్. ప్రస్తుతం ‘స్వయంభు’ షూటింగ్ లో ఉన్నాడు నిఖిల్. ఇటీవల నిఖిల్ అమెరికా వెళ్లినట్టు పలు పోస్టులు కూడా పెట్టాడు.

Also Read : Amitabh Kalki Glimpse : ఇది గ్రాఫిక్స్ అంటే.. అమితాబ్ పర్ఫెక్ట్ యంగ్ లుక్.. నాగ్ అశ్విన్ ని పొగిడేస్తున్న నెటిజన్లు..

తాజాగా నిఖిల్ అమెరికాలో అతిపెద్ద హిందూ ఆలయం శ్రీ స్వామి నారాయణ మందిర్ ని దర్శించుకున్నాడు. ఆ ఆలయం బయట దిగిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఇలాంటి అద్భుతం చూస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఇండియా వెలుపల ఉన్న అతిపెద్ద హిందూ ఆలయం. కేవలం ఆలయాన్ని దర్శించడమే కాక స్వామిజీ దగ్గర్నుంచి ఆశీర్వాదం తీసుకున్నాను. ఇది ఒక మంచి బెస్ట్ మూమెంట్ అని పోస్ట్ చేసారు. దీంతో నిఖిల్ పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ గా మారాయి.