Nikhil Swayambhu Movie shoot Begins new poster released
Swayambhu : యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ(Nikhil Siddhartha) కార్తికేయ 2తో(Karthikeya 2) పాన్ ఇండియా సక్సెస్ అందుకొని దూసుకుపోతున్నాడు. ఇటీవల Spy సినిమాతో వచ్చి పర్వాలేదనిపించారు. దీని తర్వాత నిఖిల్ చేతిలో మరో మూడు పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి. అందులో స్వయంభు ఒకటి. ఇటీవల నిఖిల్ పుట్టిన రోజు నాడు స్వయంభు సినిమాని ప్రకటించారు.
స్వయంభు సినిమాలో నిఖిల్ యోధుడిగా కనిపించబోతున్నాడు. అసలు నిఖిల్ లాంటి హీరో నుంచి ఇలాంటి సినిమా ఎవరూ ఊహించలేదు. స్వయంభు లుక్ తో నిఖిల్ అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఇప్పటికే స్వయంభు నుంచి ఒక పోస్టర్ రిలీజ్ చేయగా తాజాగా మరో పోస్టర్ రిలీజ్ చేశారు.
Baby Movie : ఆహాలోకి వచ్చేస్తున్న ‘బేబీ’ మూవీ.. డేట్ ఫిక్స్.. ఎప్పుడో తెలుసా?
నేటి నుంచి స్వయంభు సినిమా షూటింగ్ మొదలైందని ప్రకటిస్తూ నిఖిల్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. యుద్ధభూమిలో బాణాలు వదులుతూ ఉన్న నిఖిల్ పోస్టర్ అదిరిపోయింది. ఈ సినిమాని పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్ పై ఠాగూర్ మధు నిర్మిస్తుండగా భరత్ కృష్ణమాచారి తెరకెక్కిస్తున్నాడు. రవి బస్రూర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది.
The Journey Begins #Swayambhu
@iamsamyuktha_ @krishbharat20 @RaviBasrur @manojdft @TagoreMadhu @bhuvan_sagar @PixelStudiosoff @TimesMusicHub @jungleemusicSTH pic.twitter.com/9ar6yG7vyO
— Nikhil Siddhartha (@actor_Nikhil) August 18, 2023