Nilave Movie Unit Comments after Teaser Released
Nilave Movie : సౌమిత్ రావు, శ్రేయాసి సేన్ జంటగా నటించిన సినిమా ‘నిలవే’. POV ఆర్ట్స్ వ్యూ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సాయి వెన్నం, గిరిధర్ రావు పోలాటి నిర్మాణంలో సౌమిత్ రావు, సాయి వెన్నం దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి పలు పోస్టర్స్, టీజర్స్ రిలీజ్ చేసారు. టీజర్ రిలీజ్ అనంతరం తాజాగా మూవీ యూనిట్ ఓ ప్రెస్ మీట్ నిర్వహించారు.
ఈ ప్రెస్ మీట్ లో హీరో సౌమిత్ రావు మాట్లాడుతూ.. నిలవే ఒక మంచి మ్యూజికల్ లవ్ డ్రామాగా రాబోతోంది. అంతా కొత్త వాళ్లం కలిసి చేస్తున్నాం. నిజాయితీతో ఈ మూవీని చేశాం. మా సినిమా బాగుందని ఆడియెన్స్ ఫీల్ అయ్యేలా చేయాలని ప్రయత్నిస్తున్నాం. నిజాయితీకి అర్థం ఉంటే అది మా నిలవే సినిమానే అని అన్నారు. దర్శకుడు సాయి వెన్నం మాట్లాడుతూ.. మా పేర్లు, మేము ఎవ్వరికీ తెలియకపోవచ్చు. మాది చిన్న టీం కావొచ్చు. కానీ మా కాన్సెప్ట్, మా సినిమా చాలా పెద్దగా ఉంటుంది. ఇదొక అందమైన ప్రేమ కథ. మ్యూజిక్‌ని లవ్‌తో చూపించాలని అనుకున్నాం. టీజర్ చూస్తే నిజాయతీగా ఉంటుంది. ఎక్స్‌పోజింగ్ లేదని, డైలాగుల్లో బూతులు లేవని, వైరల్ అవ్వదని చాలా మంది చెప్పారు. కానీ మేము మా కంటెంట్ మాత్రమే చెప్పాలని టీజర్ కట్ చేశాం అని అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ నాయక్ మాట్లాడుతూ.. నిలవే టైంకి నా చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. అయినా నా మీద నమ్మకంతో సినిమాను ఇచ్చారు. ఈ మూవీకి కొత్త మ్యూజిక్‌ను ఇచ్చాం అని అన్నారు. కెమెరామెన్ దిలీప్ కే కుమార్ మాట్లాడుతూ.. నిలవే మ్యూజిక్ విన్న తరువాత దానికి తగ్గ విజువల్స్ ఇవ్వడం ఛాలెంజింగ్‌గా అనిపించింది అని తెలిపారు. లిరిక్ రైటర్ ఎమ్‌వి.ఎస్. భరద్వాజ్ మాట్లాడుతూ.. సౌమిత్ రావు, నేను కలిసి షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ తిరిగాం. అప్పటి నుంచి ఈ కాన్సెస్ట్ గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఇందులో పెద్ద బడ్జెట్, క్యాస్టింగ్ లేకపోవచ్చు కానీ పెద్ద డ్రీమ్, మంచి కాన్సెప్ట్ ఉంటుంది అని అన్నారు.