Karthika Deepam : కార్తీకదీపం 2 పై క్లారిటీ ఇచ్చిన డాక్ట‌ర్ బాబు.. ఏం చెప్పాడంటే..?

బుల్లితెర ప్రేక్షకుల‌ను క‌ట్టిప‌డేసిన సీరియ‌ల్స్‌లో కార్తీక దీపం(Karthika Deepam) ఒక‌టి. ప్ర‌తి ఇంటికి బాగా చేరువైంది. డాక్ట‌ర్ బాబు, వంట‌ల‌క్క కు బాగా క్రేజ్‌ను తీసుకువ‌చ్చింది.

Nirupam clarity

Karthika Deepam Doctor Babu : బుల్లితెర ప్రేక్షకుల‌ను క‌ట్టిప‌డేసిన సీరియ‌ల్స్‌లో కార్తీక దీపం (Karthika Deepam) ఒక‌టి. ప్ర‌తి ఇంటికి బాగా చేరువైంది. డాక్ట‌ర్ బాబు, వంట‌ల‌క్క కు బాగా క్రేజ్‌ను తీసుకువ‌చ్చింది. ఎంత‌లా అంటే వారు బ‌య‌ట ఎక్క‌డ క‌న‌బ‌డినా వాళ్ల అస‌లు పేరుకు బ‌దులు డాక్ట‌ర్ బాబు, వంట‌ల‌క్క అని పిలిచేంత‌గా. కొన్ని సంవ‌త్స‌రాలుగా అల‌రించిన ఈ సీరియ‌ల్‌కు గతేడాది ఫిబ్ర‌వ‌రిలో ఎండ్ కార్డ్ వేశారు. దీంతో చాలా మంది ఫ్యాన్స్ నిరాశ చెందారు.

అయితే.. గ‌త కొద్ది రోజులుగా కార్తీక దీపం సీరియ‌ల్ రెండో సీజ‌న్ తెర‌కెక్కించ‌నున్నారు అనే వార్త‌లు వినిపిస్తున్నాయి. దీంతో కార్తీక దీపం 2 ఎప్పుడెప్పుడూ వ‌స్తుందా, మ‌ళ్లీ డాక్ట‌ర్ బాబు, వంట‌ల‌క్క‌ను జంట‌గా ఎప్పుడూ చూస్తామా అని ప్రేక్ష‌కులు చాలా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే.. ఎట్ట‌కేల‌కు దీనిపై డాక్ట‌ర్ బాబుగా న‌టించిన నిరుపమ్(Nirupam) క్లారిటీ ఇచ్చేశాడు.

Bro Movie : పవన్ ‘బ్రో’ అప్డేట్.. త్వరలోనే టీజర్.. లుంగీ కట్టిన మామాఅల్లుళ్ళు..

ఇటీవ‌ల ఓ ఇంట‌ర్య్వూలో మాట్లాడుతూ ఇప్ప‌టికీ ఎక్క‌డికి వెళ్లినా స‌రే వంట‌ల‌క్క గురించే న‌న్ను అడుగుతుంటారు. నా పేరు దాదాపుగా అంద‌రూ మ‌రిచిపోయారు. డాక్ట‌ర్ బాబు అనే పిలుస్తుంటారు. ప్ర‌తి ఒక్క‌రి జీవితాల్లో గొడ‌వ‌లు ఉంటాయి. అందుక‌నే కార్తీక దీపం సీరియ‌ల్ అంద‌రికి క‌నెక్ట్ అయ్యింద‌ని చెప్పుకొచ్చారు. నా భార్య (మంజుల‌)తో క‌లిసి బ‌య‌టికి వెళ్లినా స‌రే వంట‌ల‌క్క గురించే అడుగుతుంటారు. త‌న‌కు ప‌రిస్థితి తెలుసు క‌నుక న‌వ్వి ఊరుకుంటుంది అని నిరుప‌మ్ అన్నారు.

ఇదే స‌మ‌యంలో కార్తీక‌దీపం 2 పై కూడా నిరుప‌మ్ క్లారిటీ ఇచ్చేశాడు. త‌న‌కు తెలిసినంత వ‌ర‌కు కార్తీక దీపం కొన‌సాగింపు ఉండ‌క‌పోవ‌చ్చున‌ని చెప్పాడు. కార్తీక‌దీపం కంటే మంచి క‌థ దొర‌కాలి. అన్నీ కుదిరితే కార్తీక దీపం 2 చేయాలి లేదంటే దాన్ని ముట్టుకోక‌పోవ‌డ‌మే మంచిదన్నారు. ఇక వంట‌ల‌క్క‌, త‌న కాంబినేష‌న్‌లో మ‌రో సీరియ‌ల్ వ‌చ్చే అవ‌కాశం ఉంద‌న్నాడు. ఈ విష‌యం తెలుసుకున్న అభిమానులు పుల్ ఖుషీ అవుతున్నారు. అదే స‌మ‌యంలో కార్తీక దీపం కొన‌సాగింపు లేద‌ని తెలిసి బాధ‌ప‌డుతున్నారు.

Tamannaah : అభిమాని చేతిపై తమన్నా టాటూ.. ఎమోషనల్ అయిన తమన్నా..