Thammudu : నితిన్ ‘తమ్ముడు’ ట్రైలర్ వచ్చేసింది.. అక్క ఇచ్చిన మాట కోసం తమ్ముడు పోరాటం..

తాజాగా నేడు తమ్ముడు ట్రైలర్ రిలీజ్ చేసారు. మీరు కూడా ట్రైలర్ చూసేయండి..

Nithiin Laya Sapthami Gowda Varsha Bollamma Thammudu Movie Trailer Released

Thammudu : నితిన్ త్వరలో ‘తమ్ముడు’ సినిమాతో రాబోతున్నాడు. వకీల్ సాబ్ ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో నితిన్ కి అక్కగా ఒకప్పటి హీరోయిన్ లయ రీ ఎంట్రీ ఇస్తుంది. సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ, స్వాశిక.. హీరోయిన్స్ గా నటిస్తున్నారు. తమ్ముడు సినిమా జులై 4న రిలీజ్ కానుంది.

తాజాగా నేడు తమ్ముడు ట్రైలర్ రిలీజ్ చేసారు. మీరు కూడా ట్రైలర్ చూసేయండి..

 

ఈ ట్రైలర్ చూస్తుంటే.. నితిన్ అక్క పాత్రలో లయ కనిపించబోతుంది. ఆవిడ ఇచ్చిన మాట కోసం ఓ ఊరి కోసం కొంతమందితో నితిన్ ఎలా పోరాటం చేసాడు, తన కోడల్ని ఎలా కాపాడుకున్నాడు అనేలా ఉండబోతుందని తెలుస్తుంది. ట్రైలర్ ఆసక్తిగా ఫుల్ యాక్షన్ సెంటిమెంట్ తో ఉంది. మరి నితిన్ తమ్ముడు సినిమాతో హిట్ కొడతాడా చూడాలి.

Also Read : Avika Gor : ప్రియుడ్ని నిశ్చితార్థం చేసుకున్న ‘చిన్నారి పెళ్లికూతురు’.. ఫొటోలు వైరల్..