Avika Gor : ప్రియుడ్ని నిశ్చితార్థం చేసుకున్న ‘చిన్నారి పెళ్లికూతురు’.. ఫొటోలు వైరల్..
అవికా గోర్ గత కొన్నేళ్లుగా మిలింద్ చాంద్వాని అనే వ్యాపారవేత్తతో ప్రేమలో ఉంది.

Actress Avika Gor Engaged with her Boy Friend Milind Chandwani
Avika Gor : చిన్నారి పెళ్లికూతురు సీరియల్ తో నేషనల్ వైడ్ ఫేమ్ తెచ్చుకుంది అవికా గోర్. ఆ తర్వాత హీరోయిన్ గా సినిమాలు చేస్తుంది. తెలుగులో ఉయ్యాలా జంపాల, లక్ష్మి రావే మా ఇంటికి, సినిమా చూపిస్తా మామ, రాజుగారి గది 3.. లాంటి పలు సినిమాలతో హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగుతో పాటు కన్నడ, హిందీ లో కూడా పలు సినిమాలు, సిరీస్ లలో నటించింది.
అవికా గోర్ గత ఆరేళ్లుగా మిలింద్ చాంద్వాని అనే వ్యాపారవేత్తతో ప్రేమలో ఉంది. గతంలో పలుమార్లు మిలింద్ తో కలిసి దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. తాజాగా తన ప్రియుడు మిలింద్ ని నిశ్చితార్థం చేసుకుంది అవికా గోర్. మిలింద్ తో నిశ్చితార్థం ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసి ఓ ఎమోషనల్ పోస్ట్ చేసింది అవికా.