Divi – Mangli : నా ఫొటోలు వాడకండి.. నేను బర్త్ డే పార్టీ అని పిలిస్తే వెళ్ళాను.. మంగ్లీ బర్త్ డే పార్టీ గంజాయి కేసుపై దివి కామెంట్స్..
తాజాగా దివి దీనిపై స్పందిస్తూ ఓ ఆడియో క్లిప్ ని విడుదల చేసింది.

Actress Divi Gives Clarity on Mangli Birth Day Party
Divi – Mangli : నిన్న జూన్ 10 సింగర్ మంగ్లీ పుట్టిన రోజున చేవెళ్లలోని త్రిపుర రిసార్టులో బర్త్ డే పార్టీని సెలబ్రేట్ చేసుకుంది. ఈ పార్టీకి పలువురు సినీ ప్రముఖులు, ఆమె ఫ్రెండ్స్ హాజరయ్యారు. అయితే ఈ రిసార్టు పై అర్థరాత్రి పోలీసులు దాడులు నిర్వహించగా గంజాయి, విదేశీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అలాగే ఈ పార్టీకి హాజరైన పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించగా డ్రగ్స్ పాజిటివ్‌గా తేలినట్లు సమాచారం.
దీంతో మరోసారి టాలీవుడ్ లో డ్రగ్స్ కలకలం చెలరేగింది. అయితే ఈ పార్టీకి దివి కూడా వెళ్లిందని, ఆమె కూడా డ్రగ్స్ సేవించిందని ఆరోపణలు రాగా తాజాగా దివి దీనిపై స్పందిస్తూ ఓ ఆడియో క్లిప్ ని విడుదల చేసింది.
Also Read : PaPa : తమిళ్ సూపర్ హిట్ సినిమా.. తెలుగులో రిలీజ్ కి రెడీ.. ట్రైలర్ రిలీజ్..
ఈ ఆడియో క్లిప్ లో దివి మాట్లాడుతూ.. అక్కడ జరిగిన తప్పులు అన్ని మా మీద వేయడం కాదు. మీడియాలో ప్రూఫ్స్ ఉంటే నా ఫొటోలు వేయండి. ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా నా ఫొటోలు ఎలా వేస్తారు. మీరు కూడా మీ ఫ్రెండ్స్ పిలిస్తే బర్త్ డే అని వెళ్తారు. మంగ్లీ నా ఫ్రెండ్, మంచి అమ్మాయి పిలిస్తే వెళ్ళాను. అక్కడ ఏదో మిస్టేక్ జరిగితే నాది తప్పు కాదు. నా ఫొటోలు వాడకండి, నా కెరీర్ కి ఇబ్బంది అవుతుంది అని తెలిపింది.