Macherla Niyojakavargam: మాచర్ల నియోజకవర్గం ట్రైలర్.. డైరెక్ట్ యాక్షనే అంటోన్న నితిన్

యంగ్ హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మాచర్ల నియోజకవర్గం’ మొదట్నుండీ ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేస్తూ వస్తోంది. ఈ సినిమా టైటిల్ మొదలుకొని, ఇటీవల రిలీజ్ అయిన టీజర్స్, సాంగ్స్ వరకు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఈ చిత్రం సక్సెస్ అయ్యింది.

Nithiin Powerful Action In Macherla Niyojakavargam Trailer

Macherla Niyojakavargam: యంగ్ హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మాచర్ల నియోజకవర్గం’ మొదట్నుండీ ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేస్తూ వస్తోంది. ఈ సినిమా టైటిల్ మొదలుకొని, ఇటీవల రిలీజ్ అయిన టీజర్స్, సాంగ్స్ వరకు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఈ చిత్రం సక్సెస్ అయ్యింది. ఇక తాజాగా ఈ సినిమా నుండి థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ ట్రైలర్‌ను పవర్‌ప్యాక్డ్‌గా కట్ చేశారు చిత్ర యూనిట్.

Macherla Niyojakavargam: పోలీస్ స్టేషన్‌కు చేరిన ‘మాచర్ల నియోజకవర్గం’!

స్మూత్‌గా ఉంటూ అన్ని విషయాలను నెమ్మదిగా డీల్ చేసే హీరో, జిల్లా కలెక్టర్‌గా ‘మాచర్ల నియోజకర్గం’లో అడుగుపెడతాడు. అక్కడ అప్పటికే తిష్టవేసుకుని ఉన్న రాజప్ప అనే విలన్‌ను హీరో తన పవర్‌తో ఎలా ఢీకొడతాడు అనేది ఈ సినిమా కథగా ఉండబోతుందని మనకు ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఇక కలెక్టర్ పాత్రలో తొలిసారి నటిస్తున్న నితిన్ నోట పవర్‌ఫుల్ డైలాగులు పలకడం మనకు కనిపిస్తుంది. ఈ సినిమాను దర్శకుడు ఎంఎస్.రాజశేఖర్ రెడ్డి తెరకెక్కించగా, ఈ సినిమాలో భారీ క్యాస్టింగ్ ఉంది.

Macherla Niyojakavargam: ఈగో కా బాప్ అంటోన్న గుంతలకడి గురునాధం!

ఇక హీరోయిన్లుగా కేథరిన్ త్రేజా అందాల ఆరబోతతో కనువిందు చేయనుండగా, కృతి శెట్టి నితిన్‌తో రొమాన్స్ చేయనుంది. ఈ సినిమాకు మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తుండగా, నితిన్ హోం బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తోంది. ఈ సినిమాను ఆగస్టు 12న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. మరి ఈ సినిమా నితిన్ కెరీర్‌లో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.