రేపే నితిన్ ఎంగేజ్‌మెంట్ ..

  • Published By: sekhar ,Published On : July 21, 2020 / 04:52 PM IST
రేపే నితిన్ ఎంగేజ్‌మెంట్ ..

Updated On : July 21, 2020 / 5:19 PM IST

మరికొద్ది రోజుల్లో టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడు. హైదరాబాద్‌లోని ఓ లగ్జరీ హోటల్‌లో ఈ నెల 26న నితిన్, షాలినిని వివాహమాడనున్నాడు. ప్ర‌భుత్వ నియ‌మ నిబంధ‌న‌ల‌ను అనుస‌రిస్తూ ఈ వివాహ వేడుక‌ను నిర్వ‌హించ‌నున్నారు. వివాహానికి నాలుగు రోజుల ముందు ఈ నెల 22న ఎంగేజ్‌మెంట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.Nithin and Shalini's Engagement

పెద్దగా హడావుడి లేకుండా కుటుంబ సభ్యుల సమక్షంలోనే నితిన్, షాలినిల ఎంగేజ్‌మెంట్ జరుగనుంది. వివాహ వేడుకకు కూడా కేవ‌లం ఇరు కుటుంబాల‌ సభ్యులు, స‌న్నిహిత మిత్రులు మాత్రమే హాజరుకాబోతున్నారు. సోమవారం ప్రగతిభవన్‌లో తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కలిసి తన వివాహానికి ఆహ్వానించాడు నితిన్.Nithin and Shalini's Engagement