Robinhood : నితిన్ ‘రాబిన్ హుడ్’ అప్డేట్.. దొంగ‌తో రొమాన్స్ చేయ‌నున్న‌దెవ‌రో తెలుసా..?

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ న‌టిస్తున్న సినిమా ‘రాబిన్ హుడ్'.

Nithin Robinhood movie crazy update Sreeleela Joins in team

Robinhood – Sreeleela : టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ న‌టిస్తున్న సినిమా ‘రాబిన్ హుడ్’. వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. భీష్మ కాంబినేష‌న్ కావ‌డంతో ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. అయితే.. ఈ సినిమాలో మొద‌ట‌గా ర‌ష్మిక న‌టిస్తుంద‌ని చిత్ర బృందం ప్ర‌క‌టించింది. అయితే.. కొన్ని కార‌ణాల వ‌ల్ల ఆమె ఈ చిత్రం నుంచి త‌ప్పుకుంది. ఆ త‌రువాత రాశి ఖ‌న్నా తో పాటు ప‌లువురు హీరోయిన్లు పేర్లు వినిపించాయి. అయితే.. దీనిపై చిత్ర బృందం స్పందించ‌లేదు.

తాజాగా ఓ అప్‌డేట్‌తో రూమ‌ర్లు అన్నింటికి స‌మాధానం ఇచ్చింది. ఈ సినిమాలో శ్రీలీల న‌టిస్తున్న‌ట్లుగా చెప్పేసింది. ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ ఓ స‌రికొత్త పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది. శ్రీలీల పుట్టిన రోజు సంద‌ర్భంగా ఆమెకు విషెస్ తెలియ‌జేస్తూ అస‌లు విష‌యం చెప్పేసింది. లేడీ బాస్ వ‌చ్చేసింది.. హ్యాపీ బ‌ర్త్‌డే శ్రీలీల అలియాస్ నీరా వాసుదేవ్ అంటూ స్ట్రైలిష్ లుక్‌లో ఉన్న శ్రీలీల పోస్ట‌ర్‌ను అభిమానుల‌తో పంచుకుంది. ప్ర‌స్తుతం ఈ పోస్ట‌ర్ వైర‌ల్‌గా మారింది.

Harom Hara : ఇలా చేస్తే హ‌రోం హ‌ర సినిమా ఫ్రీగా చూడొచ్చు..

మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తోంది. జివి ప్రకాష్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది.