Harom Hara : ఇలా చేస్తే హరోం హర సినిమా ఫ్రీగా చూడొచ్చు..
జయాపజయాలతో సంబంధం లేకుండా వైవిధ్యమైన కథలను ఎన్నుకుంటూ సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న హీరో సుధీర్ బాబు.

Harom Hara movie team Bumper offer Buy 2 get 1 free ticket
జయాపజయాలతో సంబంధం లేకుండా వైవిధ్యమైన కథలను ఎన్నుకుంటూ సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న హీరో సుధీర్ బాబు. ఆయన నటిస్తున్న చిత్రం హరోం హర. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో మాళవిక శర్మ హీరోయిన్. సునీల్, జయప్రకాశ్, అక్షర, అర్జున గౌడ, లక్ష్మణ్ తదితరులు కీలకపాత్రలు పోషించిన ఈ మూవీ నేడు(శుక్రవారం జూన్ 14న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది
ఫస్ట్‌లుక్, టీజర్, ట్రైలర్‌లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో చిత్ర బృందం మరో బంఫర్ ఆఫర్ ప్రకటించింది. అదేంటంటే.. హరోం హర సినిమాకు రెండు టికెట్లు కొంటే ఒక టికెట్ ఫ్రీ. అవును మీరు చదివింది నిజమే. రెండు టికెట్లు కొంటే ఓ టికెట్ ఉచితంగా పొందవచ్చు. ఆన్‍లైన్‌లో ‘బుక్ మై షో’లో ఈ ఆఫర్ అందుబాటులో ఉంది.
Yevam Review : ‘యేవమ్’ మూవీ రివ్యూ.. పోలీసాఫీసర్ గా చాందిని చౌదరి మెప్పించిందా?
ఈ ఆఫర్‌ను పొందాలని అనుకునే వారు “HAROMHARA” అనే కోడ్‍ను అప్లై చేయడం ద్వారా పొందొచ్చు. బుక్ మై షోలో మూడు టికెట్లను సెలెక్ట్ చేసుకొని పేమెంట్ చేసే ముందు HAROMHARA కూపన్ కోడ్ అప్లై చేయాలి. అప్పుడు రెండు టికెట్ల ధరకే మూడు టికెట్లు వస్తాయని చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.
Buy 2 tickets and get One free for #HaromHara on Book My Show. pic.twitter.com/huehLMBQgX
— Suresh PRO (@SureshPRO_) June 13, 2024