Nithya Menen about Tamil hero comments gone viral is it true
Nithya Menen : సౌత్ యాక్ట్రెస్ నిత్యా మీనన్ సౌత్ టు నార్త్ పలు స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఇక తమిళంలో కూడా నటించగా.. అక్కడ ఆల్మోస్ట్ సూపర్ స్టార్స్ సరసనే కనిపించింది. విజయ్, ధనుష్, సూర్య, రాఘవ లారెన్స్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది. కాగా నిత్యా రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొందని, ఆ ఇంట్వ్యూలో ఆమె తమిళ్ ఇండస్ట్రీ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిందని నెట్టింట ఒక న్యూస్ వైరల్ అవుతుంది.
Sai Dharam Tej – Swathi : కాలేజీ టైంలో స్వాతి పేపర్ కాపీ కొట్టి పాస్ అయిన సాయి ధరమ్ తేజ్..
ఆ న్యూస్ ఏంటంటే.. “నేను ఇప్పటివరకు తెలుగు ఇండస్ట్రీలో ఎలాంటి సమస్య ఎదుర్కోలేదు. కానీ తమిళ పరిశ్రమలో చాలా సమస్యలను ఎదుర్కొన్నాను. ఒక తమిళ సినీ నటుడు షూటింగ్ సమయంలో నన్ను వేధించాడు” అని ఆమె పేర్కొన్నట్లు ఆ వార్తలో ఉంది. ఈ న్యూస్ తమిళ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. ఇక ఈ విషయం పై తమిళ క్రిటిక్ మనోబాల క్లారిటీ ఇస్తూ ఒక ట్వీట్ చేశాడు. ఆ వార్తలో ఎటువంటి నిజం లేదని ఆయన తెలియజేశాడు.
Peddha Kapu 1 : మూవీకి ‘పెద్ద కాపు’ అని టైటిల్ ఎందుకు పెట్టారు.. ఆ సామజిక వర్గం గురించేనా..?
అలాగే మరో వాట్సాప్ చాట్ కూడా వైరల్ అవుతుంది. ఆ చాట్ లో ఒక తమిళ్ జర్నలిస్ట్.. నిత్యా మీనన్ ఈ విషయం గురించి ప్రశ్నించాడు. ఇది నిజంగా మీరు అన్నారా..? ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అని మెసేజ్ చేశాడు. దానికి నిత్యా మీనన్ బదులిస్తూ.. తను అలా అనలేదని పేర్కొంది. ఈ చాట్ స్క్రీన్ షాట్ నెట్టింట వైరల్ గా మారింది. కాగా కొంతమంది తమిళ ప్రేక్షకులు.. నిత్యా డైరెక్ట్ గా ఒక పోస్ట్ వేసి ఈ రూమర్స్ కి చెక్ పెడితే బాగుంటుందని కోరుతున్నారు. దీంతో నిత్యా కూడా స్పందించి ఒక పోస్ట్ వేసింది. ఆ వార్తల్లో ఎటువంటి నిజం లేదని పేర్కొంది.