Sai Dharam Tej – Swathi : కాలేజీ టైంలో స్వాతి పేపర్‌ కాపీ కొట్టి పాస్ అయిన సాయి ధరమ్ తేజ్..

కాలేజీ టైంలో సాయి ధరమ్ తేజ్ స్వాతి రెడ్డి పేపర్ కాపీ కొట్టే పాస్ అయ్యాడట.

Sai Dharam Tej – Swathi : కాలేజీ టైంలో స్వాతి పేపర్‌ కాపీ కొట్టి పాస్ అయిన సాయి ధరమ్ తేజ్..

Sai Dharam Tej copying Swathi Reddy paper to pass in exams

Updated On : September 26, 2023 / 6:35 PM IST

Sai Dharam Tej – Swathi : ఇండస్ట్రీలో కలర్స్ స్వాతిగా పేరు తెచ్చుకున్న స్వాతి రెడ్డి, సుప్రీమ్ హీరోగా ఎదిగిన సాయి ధరమ్ తేజ్ ఇద్దరు కాలేజీ మేట్స్. ఆ సమయంలోనే ఇద్దరు మంచి స్నేహితులు అంట. ఇక ఇండస్ట్రీకి వచ్చిన తరువాత ఎవరి కెరీర్ లో వారు బిజీ అవ్వడంతో బయట వేదికల పై పెద్దగా కలిసి కనిపించలేదు. తాజాగా వీరిద్దరూ కలిసి ఒక మూవీ ప్రెస్ మీట్ ఈవెంట్ లో కనిపించారు. ఇక ఈ కార్యక్రమంలో స్వాతి అండ్ తేజ్ తమ కాలేజీ డేస్ గురించి ఆడియన్స్ కి తెలియజేశారు.

Peddha Kapu 1 : మూవీకి ‘పెద్ద కాపు’ అని టైటిల్ ఎందుకు పెట్టారు.. ఆ సామజిక వర్గం గురించేనా..?

వీరిద్దరి ఇనీషియల్ సాయి, స్వాతి ‘S’తోనే స్టార్ అవ్వడంతో క్లాస్ లో ఒకరి వెనుక ఒకరు ఉండేవారట. ఈక్రమంలోనే తేజ్.. ఎగ్జామ్స్ లో స్వాతి వెనుకే ఉండేవాడట. తన పేపర్ చూసే తేజ్ ఎగ్జామ్స్ పాస్ అయ్యాడని స్వాతి చెబితే.. చూపించకుండా ఏడిపించేదని సాయి ధరమ్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. కాగా వీరిద్దరూ కలిసి ఇప్పుడు ఒక షార్ట్ ఫిలింలో నటిస్తున్నారు. ‘సత్య’ ఒక ఫీచర్ ఫిలింలో వీరిద్దరూ హీరోహీరోయిన్లు నటిస్తున్నారు.

Waheeda Rehman : తమిళ నటి వహీదా రెహ్మాన్.. తెలుగు సినిమాతో ఎంట్రీ.. బాలీవుడ్‌లో బిగ్ స్టార్‌గా..

ఇటీవల ఈ మూవీ నుంచి ఒక సాంగ్ కూడా రిలీజ్ అయ్యింది. 23 నిముషాలు పాటు ఉండే ఈ ఫిలింలో 6 నిముషాలు సాంగ్ ఉంటుంది. ఇక ఈ సినిమాని సీనియర్ హీరో నరేష్ కొడుకు నవీన్ డైరెక్ట్ చేస్తున్నాడు. దేశసరిహద్దుల్లో దేశం కోసం ప్రాణం ఇచ్చే సైనికుల మాత్రమే కాదు, వారి భార్యలు కూడా తమ భర్తలని దేశం కోసం పంపించి ఎటువంటి త్యాగం చేస్తున్నారు అనే దాని పై ఈ షార్ట్ ఫిలిం తెరకెక్కించారు. సాయి ధరమ్ సైనికుడు కూడా కనిపిస్తుంటే అతడి భార్యగా స్వాతి నటించింది.