Nithya Menon : గిరిజనులతో కలిసి నిత్యామీనన్.. వారం రోజులు అక్కడే మకాం..

తాజాగా నిత్యామీనన్ ఓ గిరిజన గ్రామంలో కనపడింది. తిరుపతి జిల్లా వరదయ్యపాలెంలో ఉన్న కల్కి ఆశ్రమానికి నిత్యామీనన్ వెళ్ళింది. అక్కడ ఒక వారం రోజుల పాటు మకాం వేయనుంది. ఈ సారి న్యూ ఇయర్ వేడుకలు అక్కడే................

Nithya Menon spending time with tribal families

Nithya Menon :  మలయాళీ భామ నిత్యామీనన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగానే ఉంది. తెలుగులో చివరిసారిగా భీమ్లా నాయక్ సినిమాలో పవన్ భార్యగా కనిపించింది. ఇక తమిళ్ లో తిరు సినిమాతో మంచి విజయం సాధించింది. మలయాళంలో వరుస సినిమాలతో బిజీగా ఉంది. వండర్ ఉమెన్ అనే కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాతో ఇటీవల ఓటీటీలో కూడా పలకరించింది.

అయితే తాజాగా నిత్యామీనన్ ఓ గిరిజన గ్రామంలో కనపడింది. తిరుపతి జిల్లా వరదయ్యపాలెంలో ఉన్న కల్కి ఆశ్రమానికి నిత్యామీనన్ వెళ్ళింది. అక్కడ ఒక వారం రోజుల పాటు మకాం వేయనుంది. ఈ సారి న్యూ ఇయర్ వేడుకలు అక్కడే దైవచింతనతో జరుపుకోనున్నట్టు సమాచారం.

Ram Charan : పవన్ అన్‌స్టాపబుల్‌లో రామ్‌చరణ్‌కి కాల్ చేసిన బాలయ్య..

ఈ నేపథ్యంలో వరదయ్యపాలెం కాంభాగం గిరిజన కాలనీని సందర్శించారు. అక్కడ గిరిజన ప్రజలతో మమేకమైంది నిత్యామీనన్. గిరిజన పిల్లల్ని ఆడించింది. ఓ బిడ్డని ఎత్తుకొని కాసేపు లాలించారు. అక్కడ కల్కి ఆశ్రమంతో పాటు, గిరిజనులతోనే ఈ వారం రోజులు గడపనున్నట్టు తెలుస్తుంది. నిత్య మీనన్ గిరిజనులతో మమేకమవుతున్న కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.