Nivetha Pethuraj : నివేదా నాన్‌స్టాప్‌గా.. 48 గంటలు నిద్రపోతుందట..
బ్యూటిఫుల్ యాక్ట్రెస్ నివేదా పేతురాజ్ తన స్లీపింగ్ సీక్రెట్ రివీల్ చేసింది..

Nivetha Pethuraj
Nivetha Pethuraj: సాధారణంగా రోజుకి 8 గంటలు నిద్ర పోవాలని చెప్తుంటారు కానీ ఇప్పటి లైఫ్ స్టైల్‌ని బట్టి నాలుగు, ఐదు గంటలు పడుకుంటే గొప్ప విషయమే. కానీ ఓ హీరోయిన్ మాత్రం ఏకంగా 48 గంటల పాటు కునుకు తీస్తుందట. ఆ నటి ఎవరో తెలుసా..? నివేదా పేతురాజ్..
View this post on Instagram
కంటిన్యూస్ షెడ్యూల్స్‌తో ఎప్పుడూ బిజీగా ఉండే సెలబ్రిటీలకు కంటినిండా కునుకు తియ్యడానికి కూడా సరైన సమయం దొరకదు. దీంతో షూట్‌లో ఇబ్బంది పడాల్సి వస్తుంది. అయితే ఎంత నాన్‌స్టాప్‌గా షూటింగ్ చేసినా.. టైం దొరకాలే కానీ నాన్‌స్టాప్‌గా 48 గంటల పాటు నిద్ర పోగల కెపాసిటీ తనకుందంటూ స్లీపింగ్ సీక్రెట్ రివీల్ చేసింది.
View this post on Instagram
తమిళ నాట మంచి గుర్తింపు తెచ్చుకున్న నివేదా పేతురాజ్.. ‘మెంటల్ మదిలో’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ‘అలా..వైకుంఠపురములో’ ఇంపార్టెంట్ రోల్ చేసింది. సాయి ధరమ్ తేజ్ ‘చిత్రలహరి’, శ్రీవిష్ణుతో రెండో సారి ‘బ్రోచేవారెవరురా’ లో నటించింది. రామ్ ‘రెడ్’ మూవీలో పోలీస్ క్యారెక్టర్‌లో ఆకట్టుకుంది. ఇటీవల విశ్వక్ సేన్‌తో ‘పాగల్’ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
View this post on Instagram