Nkr18
Kalyanram Nandamuri: పాన్ ఇండియా మూవీకి ప్లాన్ చేస్తున్నారు నందమూరి యంగ్ హీరో కళ్యాణ్ రామ్. పటాస్ తరువాత సక్సెస్ రుచి చూడలేకపోయిన కళ్యాణ్ రామ్.. ఎంత మంచివాడవురా సినిమా తర్వాత ఏ సినిమాని అనౌన్స్ చెయ్యలేదు. చాలా గ్యాప్ తర్వాత.. నిర్మాతగా, హీరోగా భారీ ప్లాన్‌తో రాబోతున్నట్లు తెలుస్తుంది. టైం ట్రావెల్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమాను కొత్త దర్శకుడు ప్రముఖ నిర్మాత మల్లిడి సత్యనారాయణ రెడ్డి తనయుడు వశిష్ఠ్ తెరకెక్కిస్తున్నారు.
ఈ రోజు(మే 28న) మధ్యాహ్నం 12గంటలకు నందమూరి తారకరామారావు జయంతి సందర్భంగా సినిమా టైటిల్‌ను ప్రకటించబోతున్నారు. ఈ విషయాన్ని చిత్రయూనిట్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. సోషియో ఫాంటసీలో ఎన్టీఆర్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకి బావమరిది హరికృష్ణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాతో పాటే మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఓ ప్రాజెక్ట్ చేస్తున్నాడు కళ్యాణ్ రామ్. ఈ సినిమాతో రాజేంద్ర దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాకి కళ్యాణ్ రామ్ నిర్మాతగా వ్యవహరిస్తూ ఉండగా.. పాన్ ఇండియా సినిమాకు సంబంధించిన టైటిల్‌ను అన్నీ ఇండియన్ లాంగ్వేజెస్‌కు సూట్ అయ్యేలా పెట్టినట్లు చెబుతున్నారు.
A time travel from Evil to Good. Get ready for the powerful title reveal of the socio fantasy extravaganza #NKR18 on May 28th at 12pm. @NANDAMURIKALYAN in a never seen before role ! #Vashist pic.twitter.com/GcNBA9Oewd
— NTR Arts (@NTRArtsOfficial) May 26, 2021