Allu Arjun : అల్లు అర్జున్ సినిమాలో నో హీరోయిన్?
రాకా మూవీ తరువాత అల్లు అర్జున్ (Allu Arjun) లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ మూవీలో నటించనున్నారు.
No Heroine For Allu Arjun Lokesh Film
Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో రాకా మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీ తరువాత బన్నీ.. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించనున్నారు. ఈ మూవీపైనే ఇండస్ట్రీలో ఇంట్రెస్టింగ్ టాక్ నడుస్తోంది. మైథాలజీ నేపథ్యంలో సాగే ఈ కథలో పాటలు, డ్యూయెట్లు, రొమాన్స్ లాంటి రెగ్యులర్ ఎలిమెంట్స్ ఉండవని అంటున్నారు.
బన్నీ, లోకేష్ కనగరాజ్ కాంబో రాబోతున్న మూవీపై రెండు రకాల టాక్స్ వినిపిస్తున్నాయి. ఒకవైపు ఈ సినిమా కోసం హీరోయిన్గా పూజా హెగ్డేను తీసుకునే ఆలోచనలో ఉన్నారని వార్తలు వస్తుంటే, మరోవైపు కథ పరంగా హీరోయిన్‌కే ప్రాధాన్యం ఉండదని రూమర్స్ కూడా బలంగా వినిపిస్తున్నాయి. సినిమా పూర్తిగా హీరో క్యారెక్టర్ చుట్టూ తిరిగే హై ఇంటెన్స్ యాక్షన్ డ్రామా అని అంటున్నారు.
Pavala Shyamala : టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ నటి పావలా శ్యామల కన్నుమూత
లోకేష్ స్టైల్లోనే రియలిస్టిక్ టోన్, డార్క్ నేరేషన్, స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ఉంటాయని, అందుకే ఇందులో రొమాన్స్, డ్యూయెట్స్, లవ్ ట్రాక్‌లకు పెద్దగా స్కోప్ లేదని చెప్పుకుంటున్నారు. కథ మైథాలజీ టచ్‌తో పాటు యూనిక్ కాన్సెప్ట్‌లో ఉండటంతో హీరోయిన్ పాత్రనే పూర్తిగా తీసివేసే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది.
ఐకాన్‌స్టార్, లోకేశ్ కనగరాజ్ కాంబోలో వస్తున్న సినిమా పూర్తిగా కంటెంట్ డ్రివెన్‌గా, ఇంటర్నేషనల్ ఫీల్‌తో ఉండే..పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా ప్లాన్ చేస్తున్నారట. అల్లు అర్జున్ క్యారెక్టర్ పవర్‌ఫుల్‌గా ఉండేలా, ఎమోషన్, యాక్షన్ మిక్స్‌తో డిజైన్ చేస్తున్నారని తెలుస్తోంది. కమర్షియల్ ఎలిమెంట్స్ తగ్గించి కొత్త ప్రయోగం చేసే ప్రయత్నం చేస్తున్నారట. అయితే రూమర్స్‌గానే నడుస్తున్నాయి.
అసలు హీరోయిన్ ఉంటుందా? లేక స్ట్రైట్ యాక్షన్ మూవీనా.? అనేది సినిమా టీమ్ క్లారిటీ ఇచ్చే వరకు సస్పెన్స్ గానే ఉంది. ఒకవేళ హీరోయిన్ లేకుండా..బన్నీ సెంట్రిక్‌గానే సినిమా వస్తే మాత్రం..టాలీవుడ్లో కొత్త ట్రెండ్ సెట్ చేసినట్లే అవుతుంది. కానీ హీరోయిన్ లేకుండా..స్టోరీ బేస్డ్గా ఆడియన్స్‌ను ఆకట్టుకోవడం పాజిబులేనా అన్న చర్చ కూడా నడుస్తోంది.
