Bigg Boss 9 Telugu: బాగ్ బాస్ లో నామినేషన్స్ రచ్చ.. కన్ఫెషన్ రూమ్ కి మాస్క్ మ్యాన్.. సింపతీ గేమ్ మొదలుపెట్టాడా?

బిగ్ బాస్ సీజన్ 9 విజయవంతంగా మొదటివారం గడిచింది. ఫస్ట్ వీక్ కి గాను (Bigg Boss 9 Telugu)శ్రష్టి వర్మ ఇంటి నుండి ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్ళిపోయింది.

Nominations for the second week of Bigg Boss season 9

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ సీజన్ 9 విజయవంతంగా మొదటివారం గడిచింది. ఫస్ట్ వీక్ కి గాను శ్రష్టి వర్మ ఇంటి నుండి ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్ళిపోయింది. ఇక రెండవ వారం కూడా అదే రేంజ్ లో మొదలయ్యింది. మాస్క్ మ్యాన్ హరిత హరీష్ సింపతీ గేమ్ స్టార్ట్ చేశాడా అంటూ కంటెస్టెంట్స్ మాట్లాడుకున్నారు. శనివారం జరిగిన ఎపిసోడ్ తనను తప్పుగా పోట్రె చేశారని బాధపడుతున్న మాస్క్ మ్యాన్ ను కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచాడు బిగ్ బాస్(Bigg Boss 9 Telugu). ఎం జరిగింది అని అడగగా.. తనపై క్యారెక్టర్‌ అస్సాసినేషన్‌ జరుగుతోందని తెలిపారు. రెడ్‌ రోజెస్‌ కామెంట్ ని తప్పుగా చూపిస్తున్నారని, ఇది తన ఫ్యామిలీపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో అని ఆవేదన వ్యక్తం చేశాడు హరీష్.

Gowra Hari: మిరాయ్, హనుమాన్ సూపర్ సక్సెస్.. గౌర హరి మ్యూజిక్ కి ఫుల్ డిమాండ్.. ఒకేసారి నాలుగు భారీ సినిమాలు

దానికి సమాధానంగా బిగ్‌ బాస్‌.. ఏ ఆటలోనైనా ఇలాంటి ఆటుపోట్లు రావడం సహజమే, వాటిని ఎదుర్కోవడమే సక్సెస్‌, ధైర్యంగా ఉండు అంటూ చెప్పుకొచ్చాడు బిగ్ బాస్. అలాగే, హరీష్ ను చూసుకోవాలని బాధ్యతను రాము రాథోడ్ కి అప్పగించారు. ఇక మరోవైపు ఇమ్మాన్యుయెల్‌ తన కామెడీతో హౌస్ లో నవ్వుల పువ్వులు పూయించారు. ఓపక్క రీతూ తో, మరోపక్క తనూజాతో ఆయన చేసిన కామెడీకి కంటెస్టెంట్స్ తో, చూసిన ఆడియన్స్ కూడా ఫుల్లుగా నవ్వుకున్నారు. ఈ విషయంలో ఇమ్మాన్యుయెల్‌ కి ఆడియన్స్ నుంచి ఫుల్ పాజిటీవీటీ వస్తోంది. అనంతరం అతి ముఖ్యమైన నామినేషన్స్ ప్రక్రియను స్టార్ట్ చేశాడు బిగ్ బాస్.

కెప్టెన్‌ సంజన తప్ప మిగతావారంతా ఇద్దరిని నామినేట్‌ చేయాలని సూచించాడు. మొదట తనూజ హరీష్‌ని నామినేట్‌ చేస్తూ.. గత వారం తన ప్రవర్తనపై అవమానకరంగా మాట్లాడాడని, ఫుడ్‌ విషయంలో ఇబ్బంది కలిగించాడని నామినేట్ చేసింది. రెండో నామినేషన్‌గా ఫ్లోరా సైనీని ఎంచుకున్న తనూజా.. ఆమె ప్రతిదానికి గొడవ పెట్టుకుంటుందని తెలిపింది. తరువాత మర్యాద మనీష్ వచ్చి.. భరణిని, రీతూని నామినేట్‌ చేశాడు. భరణి డబుల్ గేమ్ ఆడుతున్నడని, గొడవలు పెడుతున్నాడని చెప్పాడు. రీతూ పనులు చేయడం లేదని, రూల్స్ బ్రేక్ చేస్తుందని ఆరోపించాడు.