Gowra Hari: మిరాయ్, హనుమాన్ సూపర్ సక్సెస్.. గౌర హరి మ్యూజిక్ కి ఫుల్ డిమాండ్.. ఒకేసారి నాలుగు భారీ సినిమాలు
గౌర హరి.. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ పేరు ఇప్పుడు ఒక సంచలనంగా మారింది(Gowra Hari). హనుమాన్ సినిమాకు తన డివోషనల్ మ్యూజిక్ అందించిన ఈ సంగీత దర్శకుడు మిరాయ్ కి ప్రాణం పోశాడు.

Goura Hari is composing music for 4 big films after Mirai
Gowra Hari: గౌర హరి.. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ పేరు ఇప్పుడు ఒక సంచలనంగా మారింది. హనుమాన్ సినిమాకు తన డివోషనల్ మ్యూజిక్ అందించిన ఈ సంగీత దర్శకుడు మిరాయ్ కి ప్రాణం పోశాడు. ఈ చిత్ర విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఓ పక్క ఎలివేషన్ సీన్స్ కోసం కమర్షియల్ మ్యూజిక్ ఇస్తూనే మరోపక్క డివోషనల్ బీజీఎమ్ తో ఆడియన్స్ ను మెస్మరైజ్ చేశారు. మరీ ముఖ్యంగా మిరాయ్ సినిమాలో వచ్చే “రుధిర కరణ.. రుధిర పవన.. రుధిర విభవ” అనే మ్యూజిక్ అయితే రోమల్లునిక్కబొడుచుకునేలా చేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే ఇప్పుడు ఈ యంగ్(Gowra Hari) మ్యూజిక్ డైరెక్టర్ కి టాలీవుడ్ లో ఫుల్ డిమాండ్ ఏర్పడింది.
మిరాయ్ సక్సెస్ లో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న గౌర హరి సినిమా గురించి, తన తదుపరి ప్రాజెక్టుల గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు. మిరాయ్ ఒక గొప్ప సినిమా. ఇలాంటి సినిమాకు మ్యూజిక్ అందించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. సంగీత పరంగా ఈ సినిమా చాలా ప్రత్యేకం. అందులోను శ్రీరాముడు తెరపై కనిపించినప్పుడు వచ్చే మ్యూజిక్ చేయడం కోసం చాలా కష్టపడ్డాం. అదే హనుమాన్ సక్సెస్ తరువాత నన్ను చాలా మంది కీరవాణి గారితో పోల్చారు. అందుకే నాపై ఎలాంటి ఇమేజ్ క్రియేట్ అవకూడదని అనుకుంటాను.
అందుకే మిరాయ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాను. నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకున్నాను. ఎందుకంటే, అంత గొప్ప వ్యక్తితో నన్ను పోల్చడం ఆనందంగానే ఉన్నప్పటికే, రేపటిరోజున ఏదైనా చిన్న తప్పు చేసినా అది ఆయనపై ప్రభావం చూపిస్తుంది. అందుకే, ఆ ఇమేజ్ పడకుండా జాగ్రత్త పడుతున్నాను. ఇక మిరాయ్ తరువాత పీపుల్ మీడియాలోనే నాలుగు పెద్ద ప్రాజెక్టులు చేస్తున్నాను. వాటిలో జాంబీ రెడ్డి2, రణమండల,కాలచక్ర, పినాక సినిమాలు చేస్తున్నాను. ఈ నాలుగు సినిమాలు దేనికదే ప్రత్యేకం. ఈ సినిమాలకు కూడా మంచి మ్యూజిక్ అందించి మిమ్మల్ని మెప్పిస్తాననే నమ్మకం నాకుంది” అంటూ చెప్పుకొచ్చాడు గౌర హరి.