Tanushree Dutta: వేరొకరితో నా బెడ్ షేర్ చేసుకొను.. నేను అంత చీప్ కాదు.. బిగ్ బాస్ పై నటి సంచలన కామెంట్స్

వీరభద్ర సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది బాలీవుడ్ బ్యూటీ తనుశ్రీ దత్తా(Tanushree Dutta). నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన ఈ సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది.

Tanushree Dutta: వేరొకరితో నా బెడ్ షేర్ చేసుకొను.. నేను అంత చీప్ కాదు.. బిగ్ బాస్ పై నటి సంచలన కామెంట్స్

Actress Tanushree Dutta's shocking comments on Hindi Bigg Boss

Updated On : September 16, 2025 / 7:25 AM IST

Tanushree Dutta: వీరభద్ర సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది బాలీవుడ్ బ్యూటీ తనుశ్రీ దత్తా. నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన ఈ సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. దాంతో, మళ్ళీ బాలీవుడ్ కి వెళ్ళిపోయింది ఈ బ్యూటీ. అక్కడ వరుస అవకాశాలు అందుకున్న ఈ భామా మంచి ఫేమ్ నే సంపాదించుకుంది. అనంతరం పెళ్లి చేసుకున్న తనుశ్రీ ఇటీవల తన ఇంట్లోవారు తనని వేధిస్తున్నారని, టార్చర్ తట్టుకోలేకపోతున్నానని, ఎవరైనా సాయం చేయండి అంటూ ఒక వీడియో విడుదల చేసింది. దాంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ నేపధ్యంలోనే నటి తనుశ్రీ దత్తా(Tanushree Dutta) బిగ్ బాస్ షోపై సంచలన కామెంట్స్ చేసింది.

Pawan Kalyan-Suman: మార్షల్ ఆర్ట్స్ పాఠాలు నేర్పండి.. పవన్ కళ్యాణ్ కు సుమన్ సూపర్ సలహా

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీని బిగ్ బాస్ ఎంట్రీ గురించి ప్రశ్నించారు యాంకర్. దానికి సమాధానంగా తనుశ్రీ మాట్లాడుతూ.. “బిగ్‌ బాస్‌ షో నాకు నచ్చదు. నిజానికి ప్రతి ఏటా బిగ్ బాస్ నుండి ఆఫర్‌ వస్తనే ఉంది. ఈ షో కోసం నాకు ఏకంగా రూ. 1.65 కోట్లు ఆఫర్ చేశారు. అంతకంటే ఎక్కువ కూడా ఇస్తామన్నారు. కానీ, ఆ ఆఫర్ ను నేను రిజెక్ట్ చేశాను. కారణం ఏంటంటే, బిగ్ బాస్ ఫార్మాట్ ఎందుకో నాకు నచ్చదు. అక్కడ పురుషులు, మహిళలు ఓకే బెడ్‌ షేర్ చేసుకుంటారు. అదే ప్లేస్‌లో గొడవలు పడతారు. అలాగే, నా ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటా. కేవలం ఒక రియాలిటీ షో కోసం ఒకే బెడ్ పై మరో వ్యక్తితో పడుకునే అమ్మాయిని కాదు. నేను అంత చీప్‌ కాదు. వాళ్ళు ఎన్ని కోట్ల ఆఫర్ చేసినా ఇచ్చినా బిగ్‌బాస్‌కు వెళ్లను” అంటూ సంచలన కామెంట్స్ చేసింది తనుశ్రీ దత్తా. ప్రస్తుతం ఆమె చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఆలాగే, ఆమె చేసిన ఈ కామెంట్స్ పై నెటిజన్స్ కూడా చాలా రకాలుగా రియాక్ట్ అవుతున్నారు.