Pawan Kalyan-Suman: మార్షల్ ఆర్ట్స్ పాఠాలు నేర్పండి.. పవన్ కళ్యాణ్ కు సుమన్ సూపర్ సలహా

సీనియర్ నటుడు సుమన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఒక మంచి సలహా ఇచ్చారు(Pawan Kalyan-Suman). పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ లో మాస్టర్ అంటూ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Pawan Kalyan-Suman: మార్షల్ ఆర్ట్స్ పాఠాలు నేర్పండి.. పవన్ కళ్యాణ్ కు సుమన్ సూపర్ సలహా

Hero Suman advises Pawan Kalyan about martial arts

Updated On : September 16, 2025 / 6:59 AM IST

Pawan Kalyan-Suman: సీనియర్ నటుడు సుమన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఒక మంచి సలహా ఇచ్చారు. పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ లో మాస్టర్ అంటూ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ అసలు విషయం ఏంటంటే? సీనియర్ నటుడు సుమన్ హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా అందరికీ సుపరిచితమే. ఆయనలో మంచి యాక్షన్ కూడా ఉన్నారు. ఎందుకంటే, ఆయన మార్షల్ ఆర్ట్స్ లో దిట్ట. కరాటేలో బ్లాక్ బెల్ట్ హోల్డర్. ఈ విషయం కూడా చాలా మందికి తెలుసు. అయితే, హీరోగా చాలా సినిమాలు చేసిన సుమన్ కాస్త గ్యాప్ తరువాత.. విలన్ గా చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు(Pawan Kalyan-Suman) కూడా పలు సినిమాల్లో నటిస్తున్నారు సుమన్.

Meena: ఇండస్ట్రీలో ఎవరు విడాకులు తీసుకున్నా.. పెళ్లి నాతోనే అనేవారు.. మీనా ఎమోషనల్ కామెంట్స్

ఇదిలా ఉంటే, సుమన్ ఇటీవల విశాఖలోని పాడేరులో జరిగిన కరాటే ట్రైనింగ్ అకాడమీ ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంద్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా ఉన్నారు. ఆయన మార్షల్ ఆర్ట్స్ లో గురువు. కాబట్టి, ఆంధ్రప్రదేశ్ స్కూళ్లలో మార్షల్ ఆర్ట్స్‌ని పాఠ్యాంశంలో చేర్చితే స్టూడెంట్స్‌కి ఎంతో ఉపయోగపడుతుందని సలహా ఇచ్చారు. ఈ ఆర్ట్‌ని ప్రమోట్ చేయడానికి తాను ఫుల్ సపోర్ట్ ఇస్తానంటూ కూడా చెప్పుకొచ్చాడు. ఇప్పటికే గిరిజన స్టూడెంట్స్‌ కి కరాటే, జూడో వంటి మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ ఇస్తున్న ప్రయత్నాలకు సుమన్ సపోర్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో, సుమన్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే, ఆయనకి కూడా మార్షల్ ఆర్ట్స్ లో ప్రావీణ్యం ఉంది. అందుకే పవన్ సినిమాల్లో యాక్షన్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఆ విషయాన్ని ఆడియన్స్ చాలా ఇష్టపడతారు. అంతేకాదు, ఆయన నటించిన కొన్ని సినిమాలకు స్టెంట్స్ కూడా ఆయనే కొరియోగ్రఫీ చేసుకుంటారు. ఇటీవల వచ్చిన హరి హర వీర మల్లు సినిమాలో క్లిమక్స్ ఫైట్ ను కూడా ఆయనే డిజైన్ చేసుకున్నాడు. ఇప్పుడు రాబోతున్న ఓజీలో కూడా కరాటే, మార్షల్ ఆర్ట్స్, అకిడో కి సంబందించిన ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ నేపధ్యంలోనే తాజాగా సుమన్ పవన్ కళ్యాణ్ కి అలాంటి సూచన ఇచ్చారు. మరి సుమన్ ఇచ్చిన సలహా కి డిప్యూటీ సీఎం ఎలా స్పందింస్తారో చూడాలి.