Sonakshi Sinha: సోనాక్షిపై నాన్ బెయిలబుల్ వారెంట్.. అసలేమైంది?

బాలీవుడ్‌ భామ, దబాంగ్ బ్యూటీ సోనాక్షి సిన్హా చిక్కులో పడింది. యూపీలోని మొరాదాబాద్ కోర్టు ఆమెపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీచేసింది. యూపీకి చెందిన ఈవెంట్‌ నిర్వాహకుడు ప్రమోద్‌ శర్మ..

Sonakshi Sinha(1)

Sonakshi Sinha: బాలీవుడ్‌ భామ, దబాంగ్ బ్యూటీ సోనాక్షి సిన్హా చిక్కులో పడింది. యూపీలోని మొరాదాబాద్ కోర్టు ఆమెపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీచేసింది. యూపీకి చెందిన ఈవెంట్‌ నిర్వాహకుడు ప్రమోద్‌ శర్మ ఢిల్లీలో ఓ కార్యక్రమం కోసం సోనాక్షి సిన్హాను ఆహ్వానించాడు. మన సెలబ్రిటీలు ప్రైవేట్ కార్యక్రమాలకు రెమ్యునరేషన్ తీసుకొని ఆ ఈవెంట్ కు హాజరయ్యే సంగతి తెలిసిందే. అలానే సోనాక్షి ఆ ఈవెంట్ కి హాజరయ్యేందుకు పారితోషకం మాట్లాడుకొని ముందుగానే సోనాక్షికి రూ. 37లక్షలు చెల్లించాడు.

Sonakshi Sinha: మతులు పోగొడుతున్న బొద్దుగుమ్మ సోనాక్షి

అయితే డబ్బులు తీసుకున్న సోనాక్షి మాత్రం ఆ కార్యక్రమానికి హాజరు కాలేదు. కారణమేంటో తెలియదు కానీ ఆ ఈవెంట్ నిర్వాహకుడికి తిరిగి ఆన్సర్ కూడా చెప్పలేదట. ఎలాగూ ఈవెంట్ కి అటెండ్ అవలేదు కనుక తాను ఇచ్చిన మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని ప్రమోద్ శర్మ అడిగినా అందుకు సోనాక్షి మేనేజర్‌ తిరస్కరించాడు. ఆ ఈవెంట్ నిర్వాహకుడు సోనాక్షిని స్వయంగా సంప్రదించినా ఎలాంటి ఫలితం లేకపోవడంతో అతను కోర్టును ఆశ్రయించాడు.

Sonakshi Sinha : చిరుతో సినిమా.. హాట్ టాపిక్ గా సోనాక్షి సిన్హా రెమ్యున‌రేష‌న్

ఈవెంట్ నిర్వాహకుడు ప్రమోద్ శర్మ సోనాక్షిపై చీటింగ్‌ కేసు దాఖలు చేశాడు. యూపీలోని మొరాదాబాద్ కోర్టు ఆమెను కోర్టుకు హాజరు కావాలని నోటీస్ ఇచ్చినా సోనాక్షి హాజరు కాలేదు. దీంతో కోర్టు ఆమెపై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. సోనాక్షిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ వ్యవహారం ఇప్పుడు బీటౌన్ లో హాట్ టాపిక్ గా మారింది. మరి సిన్హా వారమ్మాయి ఈ కేసును ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.