Sonakshi Sinha : చిరుతో సినిమా.. హాట్ టాపిక్ గా సోనాక్షి సిన్హా రెమ్యునరేషన్
చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో త్వరలో సెట్స్ పైకి రానున్న మూవీలో బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా నటిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమాకోసం సోనాక్షి భారీ రెమ్యూనరేషన్ అడిగినట్లుగా సమాచారం. ఇదే అంశంపై మూవీ మేకర్స్ సోనాక్షితో మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తుంది

Sonakshi Sinha
మెగాస్టార్ చిరంజీవి లీడ్ రోల్ లో నటిస్తున్న ఆచార్య సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ నడుస్తుంది. ఆచార్య షూటింగ్ పూర్తి కావడంతో మలయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ రీమేక్ షూటింగ్ కు వెళ్లేందుకు చిరంజీవి సిద్ధమవుతున్నారు.
ఈ సినిమాను మోహన్ రాజా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం పూర్తైన తర్వాత కేఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వం వహిస్తున్న సినిమాలో చిరంజీవి నటించనున్నారు. ఇక చిరు – బాబీ సినిమాలో సోనాక్షి సిన్హా ఫిమేల్ లీడ్ రోల్ లో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమాకు సోనాక్షి భారీగా రెమ్యునరేషన్ అడిగినట్లు తెలుస్తుంది.
ఈ సినిమా కోసం రూ.3.5 కోట్లు డిమాండ్ చేసిందట సోనాక్షి. మరి సోనాక్షి సిన్హా డిమాండ్ కు మేకర్స్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా..? లేదా అన్న దానిపై మరికొన్ని రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇక ఇదిలా ఉంటే.. చిరు మేకోవర్ లో భాగంగా ఆయుర్వేదిక్ ట్రీట్ మెంట్ కోసం వైజాగ్ వెళ్లిన విషయం తెలిసిందే. చిరంజీవి తాజా లుక్ ఒకటి ఇప్పటికే నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది.