Chiranjeevi: ఏ ఒక్కరి కోసం కాదు.. అందరి కోసం ‘అందరి వాడు’
ఏపీ ప్రభుత్వం మొత్తానికి సినిమా టికెట్ రేట్లకు సంబంధించిన జీవోను విడుదల చేసింది. ఇందులో టికెట్ రేట్ల అందరికీ ఆమోదయోగ్యంగానే ఉన్నాయి. కనిష్టంగా రూ. 20 ఉంటే.. గరిష్టంగా రూ. 250 ఉంది.

Chiranjeevi (1)
Chiranjeevi: ఏపీ ప్రభుత్వం మొత్తానికి సినిమా టికెట్ రేట్లకు సంబంధించిన జీవోను విడుదల చేసింది. ఇందులో టికెట్ రేట్ల అందరికీ ఆమోదయోగ్యంగానే ఉన్నాయి. కనిష్టంగా రూ. 20 ఉంటే.. గరిష్టంగా రూ. 250 ఉంది. అయితే 20 శాతం షూటింగ్‌లు ఏపీలో చేసి ఉండి.. రెమ్యూనరేషన్లు కాకుండా.. సినిమా బడ్జెట్ వంద కోట్లు అయి ఉంటే.. అలాంటి వాటికి టికెట్ రేట్లను పెంచుకునే వెసులు బాటును ఏపీ ప్రభుత్వం కల్పించింది. సినిమా టిక్కెట్ల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన సినిమా టికెట్ల జీవోపై మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ లో స్పందించారు.
Chiranjeevi: నా విజయం వెనుకున్నది సురేఖనే.. మహిళా దినోత్సవ సంబరాల్లో చిరు
తెలుగు సినిమా పరిశ్రమకు మేలు కలిగే విధంగా నిర్ణయం తీసుకున్నారని, థియేటర్ల మనుగడను, ప్రజలకు వినోదం అందుబాటులో ఉండాలన్న సంకల్పాన్ని దృష్టిలో ఉంచుకుని సినిమా టికెట్ల ధరలు సవరిస్తూ సరికొత్త జీవో జారీ చేసినందుకు ఏపీ సీఎం జగన్‌కు కృతజ్ఞతలు చెప్పారు. ముఖ్యంగా చిన్న సినిమాలకు ఐదవ షో వేసుకునే అవకాశం ఇవ్వడం చాలాబాగుందని తెలిపారు. ఇక ఇదే ట్వీట్‌లో రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నానీకి, అధికారులకు, కమిటీకి ధన్యవాదాలు తెలిపారు.
Chiranjeevi : ఒకే ఫ్రేమ్‌లో మెగా, సూపర్, రెబల్ స్టార్స్.. అదిరిపోయిన ఫోటో..
తాజాగా మహిళా దినోత్సవం సందర్భంగా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో ఏర్పాటు చేసిన వేడుకలలో పాల్గొన్న చిరంజీవిని మీడియా మరోసారి ఏపీలో టికెట్ల ధరల అంశంపై స్పందన కోరారు. కానీ.. సినిమా టికెట్ల జీవో గురించి ఇప్పుడు మాట్లాడను.. ఇది సందర్బం కాదు.. నేను మళ్లీ ఏది మాట్లాడిన కాంట్రవర్సీ అయ్యే అవకాశం ఉంది.. జీవో గురించి అవసరమయితే ప్రత్యేకంగా మాట్లాడతాను.. అంటూ సున్నితంగా తిరస్కరించారు. ఇది ఒకవిధంగా గౌరవప్రదమైన నిర్ణయంగానే కనిపిస్తుంది.
నిజానికి ఆ మధ్య స్టార్స్ భేటీలో చిరంజీవి.. సీఎం జగన్ ను బ్రతిమాలడం, ప్రాధేయపడినట్లు నమస్కరించడంపై ఓ వర్గం నుండి విమర్శలు వచ్చాయి. ఇండస్ట్రీలోనే చాలా మంది వ్యక్తులు ఇది సమంజసం కాదని కూడా వాదించారు. ఇక భీమ్లా నాయక్ సినిమా ప్రదర్శనలో ఇబ్బందుల సమయంలో కూడా చిరంజీవి లాంటి స్థాయి వ్యక్తి అలా ప్రాధేయపడినా ఏపీ ప్రభుత్వం నుండి అదే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందని పవన్ ఫ్యాన్స్ కొందరు చర్చించుకున్నారు. అయితే.. ఇప్పుడు ఫైనల్ గా టికెట్ల ధరల సమస్య పరిష్కారమైంది.
Chiranjeevi : నీ ఆశీస్సులు తీసుకోలేకపోతున్నా అమ్మ.. చిరంజీవి తల్లి పుట్టినరోజుపై ఎమోషనల్ ట్వీట్
దీంతో మెగా అభిమానులు ఈ అంశంలో చిరంజీవి కృషిని గుర్తు చేసుకుంటున్నారు. ఒకటికి రెండుసార్లు ఏపీ ప్రభుత్వ పెద్దలతో చేసిన చర్చలు గుర్తు చేసుకుంటున్నారు. అన్నయ్య ఒక్కరి కోసమో ఒక సినిమా కోసమో ప్రాధేయపడలేదని.. అందరి కోసం అందరి సినిమాలకు ఇబ్బందులు లేకుండా ఉండేలా చూడాలని మాత్రమే కోరుకున్నారని.. అందుకే ఓర్పు, సహనంతో గౌరవప్రదంగానే ప్రవర్తించారని ప్రశంసిస్తున్నారు.