Nayanthara : “మూడు కాదు.. ముప్పై సెకన్లు..” దొరికిపోయిన నయన్.. ధనుష్ చేసింది కరెక్టే అంటున్న నెటిజన్స్
లేడీ సూపర్ స్టార్ నయనతార, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ల మధ్య వార్ చిలికి చిలికి పెద్దదవుతుంది. నయనతార ఇప్పటికే తన పెళ్లి వీడియోని నెట్ ఫ్లిక్స్‌కి అమ్ముకున్న సంగతి తెలిసిందే. అలాగే తన జీవితంలో ప్రేమ పెళ్లి, పిల్లలు అన్ని ఎలా జరిగాయో డాక్యుమెంటరీ రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది.

Not three seconds thirty seconds Nayanthara was caught Dhanush did the right thing
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ల మధ్య వార్ చిలికి చిలికి పెద్దదవుతుంది. నయనతార ఇప్పటికే తన పెళ్లి వీడియోని నెట్ ఫ్లిక్స్‌కి అమ్ముకున్న సంగతి తెలిసిందే. అలాగే తన జీవితంలో ప్రేమ పెళ్లి, పిల్లలు అన్ని ఎలా జరిగాయో డాక్యుమెంటరీ రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. ఇక ఇందులో నానుమ్ రౌడీ దానే సినిమాలోని మూడు సెకన్ల వీడియో తీసుకుంటానని దాదాపుగా రెండేళ్ల క్రితం ఈ సినిమా నిర్మాత అయిన ధనుష్ ని అడిగితే నో అబ్జెక్షన్ లెటర్ ఇప్పటి వరకు పంపలేదు.
ధనుష్ ని అడిగి అడిగి విసిగిపోయిన నయన్, ధనుష్ పర్మిషన్ లేకుండానే మూడు సెకన్ల వీడియో తన డాక్యుమెంటరీలో వాడుకున్నారు. ఇందుకుగాను ధనుష్ నయన్ పై పది కోట్ల నష్టపరిహారం వేసాడు. నయన్ ఈ విషయం పై స్పందిస్తూ.. మూడు ఏళ్ల నుండి నీ చుట్టూ తిప్పించుకొని కేవలం మూడు సెకన్ల వీడియో కోసం పది కోట్లు కట్టాలా అని ఫైర్ అవుతుంది . అయితే నయన్ డాక్యుమెంటరీ చూసుకుంటే.. ఆమె నానుమ్ రౌడీ దానే సినిమా నుండి తీసుకుంది మూడు సెకన్ల వీడియో కాదు.. దాదాపుగా 25 నుండి 30 సెకన్ల వరకు ఆ వీడియో ఉంది.
Also Read : Mahesh Babu : ‘అలాంటివాడే అసలైన పురుషుడు’.. మెన్స్ డే సందర్బంగా మహేష్ స్పెషల్ పోస్ట్
ఇక అసలు విషయం తెలుసుకున్న ఆడియన్స్.. నువ్వు తీసుకుంది 25 సెకన్ల వీడియో.. అందుకే ధనుష్ 10 కోట్లు కట్టమని అన్నాడు. అందులో తప్పేముంది. ఇప్పటికే నువ్వు నెట్ ఫ్లిక్స్ నుండి బాగా పుచ్చుకున్నావ్ కదా.. అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. మరి మూడు సెకన్లని 30 సెకన్ల వీడియో తీసుకున్న నయన్ ఈ విషయంపై ఎటువంటి సమాధానం ఇస్తుందో చూడాలి.