NTR Adhurs All Set To Re-Release In March
NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాస్ట్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనం చూశాం. ఈ సినిమాను దర్శకుడు రాజమౌళి తెరకెక్కించగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాలో మరో హీరోగా నటించాడు. అయితే తారక్ సోలో మూవీ వచ్చి చాలా రోజులవుతుండటంతో, ఆయన నెక్ట్స్ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
NTR : ఫ్యాన్స్ ధాటికి తట్టుకోలేకపోతున్న హీరోలు.. అందుకే ఎన్టీఆర్ సీరియస్ అయ్యాడా?
ఇదిలా ఉండగ, తారక్ తన అభిమానులకు ఓ అదిరిపోయే న్యూస్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఎన్టీఆర్ కెరీర్‌లో మంచి విజయాన్ని అందుకున్న ‘అదుర్స్’ మూవీ గురించి అందరికీ తెలిసిందే. ఈ సినిమాను మాస్ చిత్రాల దర్శకుడు వివి.వినాయక్ తెరకెక్కించగా, తారక్ ఈ సినిమాలో డ్యుయెల్ రోల్‌లో నటించాడు. ఇక ఎన్టీఆర్, బ్రహ్మానందంల జోడీ చారి-భట్టుగా చేసిన కామెడీ కడుపుబ్బా నవ్వులు పంచింది. ఇప్పుడు ఈ సినిమాను రీ-రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.
NTR : RRR ఆస్కార్‌కి వెళ్లడం నా గొప్పతనం కాదు, అతని గొప్పతనం.. ఎన్టీఆర్!
‘అదుర్స్’ సినిమాకు ఇప్పటికీ బుల్లితెరపై మంచి ప్రేక్షకాదరణ దక్కుతోంది. దీంతో ఈ సినిమాను థియేటర్లలో రీ-రిలీజ్ చేస్తే ప్రేక్షకులు ఖచ్చితంగా ఆదరిస్తారని చిత్ర వర్గాలు భావిస్తున్నాయి. ఇక ఈ సినిమాను మార్చి 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ సినిమాలో నయనతార, షీలా హీరోయిన్లుగా నటించగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. మరి ‘అదుర్స్’ చిత్రానికి ప్రేక్షకులు మళ్లీ ఎలాంటి రెస్పాన్స్‌ను అందిస్తారో చూడాలి.