NTR – Aamir Khan : ఎన్టీఆర్ వర్సెస్ అమీర్ ఖాన్.. ఎవరు దాదా సాహెబ్ ఫాల్కే..? ఫ్యాన్స్ లో కన్ఫ్యూజన్..

గత రెండు రోజులుగా దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ చర్చగా మారింది.

NTR and Aamir Khan will do Dadasaheb Phalke Biopic Rumors goes Viral

NTR – Aamir Khan : ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా, ఇండియాలో మొట్టమొదటి సినిమా తీసిన దర్శకుడు దాదాసాహెబ్ ఫాల్కే. భారతదేశంలో సినీ పరిశ్రమ మొదలవ్వడానికి కారకులైన వారిలో ఒకరు. కేంద్రప్రభుత్వం కూడా దాదాసాహెబ్ ఫాల్కే పేరుమీద జాతీయ అవార్డు అందిస్తుంది. ఇప్పటికే అనేక బయోపిక్ లు వస్తున్న తరుణంలో దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ కూడా రానుంది.

గత రెండు రోజులుగా దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ చర్చగా మారింది. రాజమౌళి నిర్మాణంలో బాలీవుడ్ డైరెక్టర్ నితిన్ కక్కర్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ చేస్తారని, దాదాసాహెబ్ ఫాల్కే పాత్రలో ఎన్టీఆర్ నటించబోతున్నాడని వార్తలు వచ్చాయి. ఇప్పటికే ఫ్యాన్స్ ఎన్టీఆర్ ని దాదాసాహెబ్ ఫాల్కే లాగా AI తో ఫొటోలు కూడా జనరేట్ చేసి వైరల్ చేస్తున్నారు. ఈ వార్త విని ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేశారు.

Also Read : Rajamouli : రాజమౌళి ఇండస్ట్రీని పాడు చేశారు.. డిస్ట్రిబ్యూటర్ సంచలన వ్యాఖ్యలు..

అయితే ఇవాళ అమీర్ ఖాన్ కూడా దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణి దర్శకత్వంలో ఆమిర్ ఖాన్ దాదాసాహెబ్ ఫాల్కే పాత్రని పోషిస్తాడని బాలీవుడ్ లో వార్తలు వచ్చాయి. దీంతో దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ మీద రెండు సినిమాలు చేయబోతున్నారా అనే సందేహం ఫ్యాన్స్, ప్రేక్షకులలో ఏర్పడింది.

ఎన్టీఆర్, ఆమిర్ ఖాన్ ఇద్దరూ దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ చేస్తారా? లేక ఎవరో ఒకరు ఆగుతారా? అని చర్చగా మారింది. దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ ఎన్టీఆర్ చేస్తాడు అనగానే హ్యాపీగా ఫీల్ అయిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ నేడు ఆమిర్ ఖాన్ కూడా అదే బయోపిక్ చేస్తాడు అని వార్తలు రావడంతో నిరాశ చెందుతూనే ఎన్టీఆర్ చేస్తాడా చేయడా అని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఎన్టీఆర్, ఆమీర్ ఖాన్ లలో ఎవరో ఒకరు ఈ దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ పై క్లారిటీ ఇస్తే బెటర్ ఏమో.

Also Read : Karate Kid – Legends : ‘కరాటే కిడ్ : లెజెండ్స్’ కోసం తండ్రి కొడుకులు.. అజయ్ దేవగణ్ – యుగ్ దేవగణ్..