‘‘ఈ అస్తిత్వం మీరు, ఈ వ్య‌క్తిత్వం మీరు’’.. తారక్, కళ్యాణ్ రామ్ ఎమోషనల్ ట్వీట్..

  • Publish Date - September 2, 2020 / 01:54 PM IST

Harikrishna Jayanthi-NTR and Kalyan Ram Emotional Tweet: న‌టుడిగా, చైత‌న్య ర‌థ‌సార‌థిగా, రాజ‌కీయ నాయ‌కుడిగా తెలుగు ప్రేక్ష‌కుల గుండెల్లో చెర‌గ‌ని ముద్రవేసి, తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న గొప్పవ్య‌క్తి.. టైగర్, సాహసరత్న నందమూరి హ‌రికృష్ణ‌. ఆగ‌స్ట్ 29, 2018న జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో హ‌రికృష్ణ క‌న్నుమూశారు. సెప్టెంబ‌ర్ 2న హ‌రికృష్ణ 64వ జ‌యంతి. ఈ సందర్భంగా తండ్రి స్మృతుల‌ను గుర్తు చేసుకుంటూ తనయులు కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ భావోద్వేగభరితమైన ట్వీట్ చేశారు.


https://10tv.in/ram-charan-expresses-their-condolences-to-the-families-of-the-deceased-pawan-kalyan-fans/
‘‘ఈ అస్తిత్వం మీరు, ఈ వ్య‌క్తిత్వం మీరు.. మొక్క‌వోని ధైర్యంతో కొన‌సాగే మా ఈ ప్ర‌స్థానానికి నేతృత్వం మీరు. ఆజ‌న్మాంతం త‌లుచుకునే అశ్రుక‌ణం మీరే’’ అంటూ హరికృష్ణ త‌న‌యులు నంద‌మూరి క‌ల్యాణ్ రామ్‌, తార‌క్ ఎమోష‌న‌ల్ ట్వీట్ చేశారు. నారా రోహిత్, అనిల్ రావిపూడితో సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హరికృష్ణకు నివాళులు అర్పిస్తూ ట్వీట్లు చేశారు.