NTR and Pawan Kalyan said no to Director Sriwass Movie
Director Sriwass : లక్ష్యం(Lakshyam) సినిమాతో టాలీవుడ్(Tollywood) లో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు శ్రీవాస్(Sriwass). తర్వాత రామరామ కృష్ణకృష్ణ(RamaRama KrishnaKrishna) సినిమాతో మరో విజయం అందుకున్నాడు. ఆ తర్వాత లౌక్యం(Loukyam) తప్ప శ్రీవాస్ తీసిన సినిమాలు అన్ని పరాజయం పాలయ్యాయి. లక్ష్యం, లౌక్యం సినిమాల తర్వాత శ్రీవాస్ ప్రస్తుతం గోపీచంద్(Gopichand) తో మూడో సినిమా రామబాణం(Ramabanam) చేస్తున్నారు. షూటింగ్ ముగించుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లో ఉంది ఈ సినిమా.
గోపిచంద్ హీరోగా, డింపుల్ హయతి హీరోయిన్ గా శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రామబాణం సినిమా మే 5న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాతో శ్రీవాస్ – గోపీచంద్ కాంబో హ్యాట్రిక్ హిట్ కొట్టాలనుకుంటున్నారు. ప్రస్తుతం ఓ పక్క రామబాణం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ చేస్తూనే ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు చిత్రయూనిట్. ఇప్పటికే రామబాణం నుంచి రెండు పాటలు కూడా రిలీజయ్యాయి. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో శ్రీవాస్ మాట్లాడుతూ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Shahrukh Khan : నేను నిన్ను బాగా పెంచాను.. యాడ్ విషయంలో కూతురిపై షారుఖ్ స్పెషల్ పోస్ట్..
శ్రీవాస్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నా మొదటి సినిమా లక్ష్యం రిలీజయి హిట్ అయినా తర్వాత దిల్ రాజు తో ఓ సినిమా చర్చలు జరిగాయి. అయన స్టార్ హీరోని తీసుకురమ్మనడంతో ఓ కథని ఎన్టీఆర్ కి చెప్పగా చాలా మంచి సబ్జెక్ట్, ఇలాంటి సినిమాలు రాలేదు పూర్తిగా స్క్రిప్ట్ రెడీ చేయండి అన్నారు. దీంతో చాలా కష్టపడి స్క్రిప్ట్ పూర్తి చేశా. ఫుల్ స్క్రిప్ట్ తో మళ్ళీ ఎన్టీఆర్ ని కలిసాను, కానీ ఏమైందో ఈ సారి కథ తనకు సూట్ అవ్వదు అని ఎన్టీఆర్ అన్నారు. దాంతో ఆ సినిమా ఆగిపోయింది. ఒకవేళ ఎన్టీఆర్ ఆ సినిమా చేసి ఉంటే ఆ తర్వాత శ్రీమంతుడు, మహర్షి లాంటి సినిమాలు వచ్చేవి కావు అని అన్నారు.
Ananya Panday : అవన్నీ అబద్దాలు.. అనన్య ఎవరితో ప్రేమలో లేదు.. క్లారిటీ ఇచ్చిన తల్లి..
అలాగే.. ఎన్టీఆర్ నో చెప్పిన ఆ స్టోరీని కొన్ని రోజులకు పవన్ కళ్యాణ్ గారికి వినిపించాను. ఆయన కూడా కథ బాగుంది చేద్దాం అన్నారు. కానీ ఆ తర్వాత పవన్ గారు కూడా ఆ సినిమాకు నో చెప్పారు. ఎప్పటికైనా ఆ కథతో సినిమా చేస్తా. ఆ సినిమాకు సంబంధించి కొన్ని అంశాలు ఇతర సినిమాల్లో ఉన్నా సోల్ మాత్రం ఈ కథలోనే ఉంది అన్నారు. దీంతో పవన్, ఎన్టీఆర్ లు కథ బాగుందని, అనంతరం సినిమాకి నో చెప్పారని శ్రీవాస్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.