NTR : అప్పుడే ప్రిపేర్ అయిపోతున్న ఎన్టీఆర్.. చేతిలో ఉన్న బుక్ ఏంటో తెలుసా?

తాజాగా ఎన్టీఆర్ వార్ 2 పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసం ముంబై వెళ్ళాడు.

NTR Carry Muruga Book in Mumbai Video goes Viral

NTR : ఎన్టీఆర్ ప్రస్తుతం బాలీవుడ్ లో హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 సినిమా అచేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆగస్టు 14న రిలీజ్ కానుంది. మరో పక్క ప్రశాంత్ నీల్ సినిమా కూడా చేస్తునాడు. ఇటీవలే త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా చేస్తున్నాడని నాగవంశీ ప్రకటించారు. అల్లు అర్జున్ తో చేయాల్సిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కథను ఎన్టీఆర్ తో చేస్తున్నారని తెలిసింది.

తాజాగా ఎన్టీఆర్ వార్ 2 పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసం ముంబై వెళ్ళాడు. ముంబైలో ఎన్టీఆర్ చేతిలో మురుగ అనే పుస్తకంతో కనపడ్డాడు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. వార్ 2 ఎలాగూ అయిపొయింది. ప్రశాంత్ నీల్ సినిమా తర్వాత త్రివిక్రమ్ సినిమానే మొదలుపెడతాడు కాబట్టి ఇప్పట్నుంచే ఆ సినిమా కోసం ప్రిపేర్ అవుతున్నాడని, అందుకే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన బుక్ చదువుతున్నాడని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

Also See : Laya Daughter Sloka : లయ కూతురు ‘శ్లోక’.. బర్త్ డే సెలబ్రేషన్స్ ఫొటోలు..

ఎన్టీఆర్ చేతిలో ఉన్న బుక్ పేరు మురుగ. ఆనంద్ బాలసుబ్రమణ్యన్ దీనిని రచించారు. తెలివికి, యుద్దానికి దేవుడు అనేది ఈ బుక్ ట్యాగ్ లైన్. ఈ బుక్ లో సుబ్రమణ్య స్వామి జననం, చరిత్ర, ఆయన గురించి అన్ని డీటెయిల్స్ ఉంటాయి. ఎన్టీఆర్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పాత్ర చేయబోతున్నాడు, లేదా ఆ పాత్రకు సంబంధించిన కథ కాబట్టి ఇప్పట్నుంచే పూర్తిగా రీసెర్చ్ చేస్తున్నాడని ఆయన ఫ్యాన్స్ భావిస్తున్నారు.

 

Also Read : Laya : ‘లయ’ రీ ఎంట్రీ.. ఇన్నాళ్లు అమెరికాలో ఏం చేసేదో తెలుసా..? అన్ని డబ్బులు వదిలేసుకొని సినిమా కోసం..