Laya : ‘లయ’ రీ ఎంట్రీ.. ఇన్నాళ్లు అమెరికాలో ఏం చేసేదో తెలుసా..? అన్ని డబ్బులు వదిలేసుకొని సినిమా కోసం..
తాజాగా లయ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు తెలిపింది.

Do You Know Actress Laya work in America before Re Entry with Nithiin Thammudu Movie
Laya : ఒకప్పుడు స్వయంవరం, ప్రేమించు, మనోహరం, హనుమాన్ జంక్షన్, మిస్సమ్మ, స్వరాభిషేకం.. లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన తెలుగు నటి లయ. కానీ పెళ్లి తర్వాత అమెరికాలో సెటిల్ అయిపొయింది. పెళ్లి తర్వాత ఓ రెండు సినిమాల్లో గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చినా ఇప్పుడు నితిన్ తమ్ముడు సినిమాతో రీ ఎంట్రీ ఇస్తుంది. తమ్ముడు సినిమాలో నితిన్ కి అక్క పాత్రలో లయ నటిస్తుంది.
అమెరికా నుంచి వచ్చి ఇక్కడే షూటింగ్స్ చేసి, ప్రమోషన్స్ లో కూడా పాల్గొంటుంది. తాజాగా లయ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు తెలిపింది. లయ MCA చదివింది. అప్పట్లో సినిమాలు చేస్తూనే చదువుకుంది. అమెరికాకు వెళ్ళిపోయాక లయ ఐటీ ఫీల్డ్ లో జాబ్ చేసింది. ఇక అమెరికాలో ఐటీ జాబ్ అంటే వేతనం కూడా భారీగా ఉంటుందని తెలిసిందే.
Also Read : COOLIE : రజనీకాంత్ ‘కూలీ’ నుంచి ‘చికిటు’ సాంగ్ వచ్చేసింది..
తమ్ముడు కోసం రీ ఎంట్రీ ముందు వరకు కూడా లయ ఐటీ జాబ్ చేసిందట. లక్షల్లో జీతం వచ్చేదని, కానీ తమ్ముడు సినిమా ఆఫర్ వచ్చిన తర్వాత జాబ్ వదిలేసుకొని మరీ ఇక్కడికి వచ్చానని, నాకు సినిమా రెమ్యునరేషన్ కంటే కూడా ఐటీ జాబ్ లోనే ఎక్కువ డబ్బులు వస్తాయని, మూవీ యూనిట్ కూడా మీకు ఐటీ జాబ్ లో వచ్చేంత ఇవ్వలేమని చెప్పారని, అయినా సినిమా మీద ఇష్టంతో చాన్నాళ్లకు ఒక మంచి పాత్ర వచ్చిందని జాబ్ వదిలేసుకొని వచ్చానని తెలిపింది.
మంచి పాత్రలు వస్తే సినిమాలు కంటిన్యూ చేస్తానని లేకపోతే మళ్ళీ అమెరికా వెళ్లి ఐటీ జాబ్ చేసుకుంటాను అని చెప్పింది. నెలకు లక్షలు సంపాదించే ఐటీ జాబ్ వదులుకొని సినిమా కోసం, రీ ఎంట్రీ కోసం వచ్చిందంటే గ్రేట్ అని లయని అభినందిస్తున్నారు. ఇక లయ భర్త అమెరికాలో డాక్టర్ గా సెటిల్ అయ్యారు. లయకు ఒక పాప, బాబు ఉన్నారు. ఇద్దరూ అమెరికాలోనే చదువుకుంటున్నారు.
Also Read : Kannappa : మంచు విష్ణు ‘కన్నప్ప’కు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. 10 రోజుల పాటు..