NTR Comments on Tamilanadu Dindigul Thalappakatti Biryani in Chennai Devara Press Meet
NTR – Biryani : ఎన్టీఆర్ మంచి ఫుడీ అని అందరికి తెలిసిందే. చాలా సార్లు తనకు ఇష్టమైన ఫుడ్ గురించి, తాను బాగా తింటానని తెలిపాడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ సన్నిహితులు కూడా ఎన్టీఆర్ బాగా తింటాడని పలుమార్లు తెలిపారు. ఎన్టీఆర్ కి నాటుకోడి కీమా అంటే చాలా ఇష్టమని, చికెన్ బిర్యానీ అంటే చాలా ఇష్టమని ఓ ఇంటర్వ్యూలో కూడా తెలిపాడు. తాజాగా మరోసారి ఎన్టీఆర్ ఫుడ్ గురించి కామెంట్స్ చేసాడు.
ఎన్టీఆర్ నిన్న దేవర ప్రమోషన్స్ కోసం చెన్నై వెళ్లారు. అక్కడ యాంకర్ వరుస ప్రశ్నలు వేస్తుండటంతో ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఎన్టీఆర్ మాట్లాడుతూ.. మీరు నా ప్లాన్ ని నాశనం చేస్తున్నారు. నేను వెళ్ళేటప్పుడు దిండిగల్ తలప్పకట్టి బిర్యానీ ప్యాక్ చేసుకొని తీసుకెళ్దాం అనుకున్నాను. ఇప్పుడు నేను పరిగెత్తాలి. అది మిస్ అయిపోద్దేమో. దేవర రిలీజ్ తర్వాత వచ్చినప్పుడు మన ఇద్దరం వెళ్లి తిందాం అని యాంకర్ తో సరదాగా అన్నారు.
Also See : NTR Devara Press Meet : ఎన్టీఆర్ ‘దేవర’ ప్రెస్ మీట్ ఫోటోలు చూశారా..?
దీంతో ఎన్టీఆర్ కి తమిళనాడులో దిండిగల్ తలప్పకట్టి బిర్యానీ అంటే ఇష్టమని తెలుస్తుంది. దిండిగల్ తలప్పకట్టి బిర్యానీ అనేది తమిళనాడు బేగంబుర్ వద్ద ఉన్న దిండిగల్ లో బాగా ఫేమస్. 1957 నుంచి అక్కడ బిర్యానీ అమ్ముతున్నారు. మన ప్యారడైజ్ బిర్యానీలాగా అక్కడ దిండిగల్ తలప్పకట్టి బిర్యానీ బాగా ఫేమస్. ఆ ఫేమస్ బిర్యానీ ఎన్టీఆర్ కి ఇష్టం అని ఇలా ఇండైరెక్ట్ గా ప్రెస్ మీట్ లో తెలిపారు.
"I wanted to pack Dindigul Thalappakatti Biriyani "
Foodie #JrNTR 😂❤️pic.twitter.com/lOlNfolB61
— Ayyappan (@Ayyappan_1504) September 17, 2024