Devara Glimpse : రెడీగా ఉండండి ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ‘దేవర’ గ్లింప్స్ సాయంత్రం ఎన్నింటికో తెలుసా? ఏ యూట్యూబ్ ఛానల్‌లో?

న్యూ ఇయర్ కి జనవరి 8న దేవర సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ చేస్తామని ప్రకటించారు. దీంతో ఎన్టీఆర్ అభిమానులు అంతా దేవర గ్లింప్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

NTR Devara Glimpse Releasing Time and You Tube Channels Full Details Here

Devara Glimpse : RRR తర్వాత ఎన్టీఆర్(NTR) నుంచి రాబోయే దేవర సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు నందమూరి అభిమానులు. కొరటాల శివ(Koratala Siva) దర్శకత్వంలో ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా, బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్ గా దేవర సినిమాని భారీగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటివరకు కేవలం రెండు పోస్టర్స్ మాత్రమే రిలీజ్ చేసి సినిమా మోస్ట్ వైలెన్స్, మాస్ గా ఉంటుందని చెప్పడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇక ఇటీవల న్యూ ఇయర్ కి జనవరి 8న దేవర సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ చేస్తామని ప్రకటించారు. దీంతో ఎన్టీఆర్ అభిమానులు అంతా దేవర గ్లింప్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దేవర గ్లింప్స్ నేడు జనవరి 8న సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకి రిలీజ్ చేయనున్నారు. అయితే దేవర సినిమా పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దీంతో గ్లింప్స్ ని కూడా పాన్ ఇండియా వైడ్ తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు.

Also Read : Ayalaan : సంక్రాంతికి తెలుగు సినిమాలకే థియేటర్స్ లేవురా బాబు అంటే.. తమిళ్ డబ్బింగ్ సినిమా అవసరమా?

దేవర గ్లింప్స్ తెలుగులో YUVASUDHAARTS యూట్యూబ్ ఛానల్, హిందీలో TSERIES, తమిళ్ లో TSERIESTAMIL, కన్నడలో JRNTROFFICIAL, మళయాలంలో NTRARTSOFFICIAL యూట్యూబ్ ఛానల్స్ లో రిలీజ్ కాబోతుంది. ఆల్రెడీ ఒక మూడు సెకండ్స్ నిడివి ఉన్న ఓ వీడియోని ముందే రిలీజ్ చేసి మరింత హైప్ పెంచారు చిత్రయూనిట్. ఈ వీడియోలో మనుషులని నరికిన గొడ్డలిని సముద్రంలో కడుగుతుంటే రక్తం నీళ్ళల్లో కలుస్తున్నట్టు చూపించారు. దీంతో గ్లింప్స్ లో, సినిమాలో ఏ రేంజ్ లో ఊచకోత ఉండబోతుందో అని లెక్కలేసుకుంటున్నారు అభిమానులు.