Devara Making Video : ‘దేవర’ మేకింగ్ వీడియో చూశారా..? సముద్రాన్నే సృష్టించారుగా..

ఎన్టీఆర్ ఫ్యాన్స్ దేవర మేకింగ్ వీడియో విజువల్స్ ని సపరేట్ గా కట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

NTR Devara Movie Making Video goes Viral Watch Here

Devara Making Video : ఎన్టీఆర్ దేవర సినిమా కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం దేవర మూవీ యూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. నిన్న సందీప్ రెడ్డి వంగతో దేవర టీమ్ చేసిన స్పెషల్ ఇంటర్వ్యూ రిలీజ్ చేసారు. దీంతో ఈ ఇంటర్వ్యూ వైరల్ గా మారింది.

అయితే ఈ ఇంటర్వ్యూలో దేవర మేకింగ్ వీడియోలను కూడా చూపించారు. దేవర సినిమా ఎక్కువగా సముద్రం ఒడ్డున జరిగే కథ. దీంతో ఈ సినిమా షూటింగ్స్ అన్ని సముద్రం ఉన్న గోవా, గోకర్ణ, అండమాన్, థాయిలాండ్.. లాంటి పలు ప్రాంతాల్లో షూటింగ్ చేసారు. దేవర సినిమాలో ఆల్మోస్ట్ అరగంట సేపు నీళ్ళల్లో సాగే యాక్షన్ సీక్వెన్స్ ఉందని చెప్తున్నారు. ఎన్టీఆర్ కూడా దీని గురించి గొప్పగా చెప్తూ హైప్ పెంచుతున్నారు.

Also Read : Saripodhaa Sanivaaram : దసరా తర్వాత మరో వంద కోట్లు సాధించిన నాని.. లెక్క సరిపోయింది..

అయితే ఈ యాక్షన్ సీక్వెన్స్ కోసం రామోజీ ఫిలిం సిటీలో భారీ పూల్ ఏర్పాటు చేసారు. ఒక సముద్రాన్ని సృష్టించారు. సముద్రంలో తీసే యాక్షన్ సీక్వెన్స్ కి తగ్గట్టు ఆ పూల్ ని డిజైన్ చేసారు. నీళ్ళల్లో ఉండే ఫైట్ సీన్స్ అన్ని ఇక్కడే షూట్ చేసారు. దేవర ఇంటర్వ్యూలో మేకింగ్ వీడియో చూస్తే బాగా కష్టపడ్డారు అని తెలుస్తుంది. అలలు వచ్చేలా చేయడం, మరబోట్లు తీసుకురావడం, నీళ్ళల్లో కెమెరాను పెట్టి షూట్ చేయడం.. ఇలా మేకింగ్ వీడియోలో ఆసక్తికరంగా చూపించారు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ దేవర మేకింగ్ వీడియో విజువల్స్ ని సపరేట్ గా కట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

మీరు కూడా దేవర మేకింగ్ వీడియో చూసేయండి..